Gyanvapi Case: జ్ఞానవాపి వివాదంలో ముస్లిం సంస్థలకు చుక్కెదురు.! 5 పిటిషన్ల కొట్టివేత
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు కీలకతీర్పు ఇచ్చింది. ఈ కేసులో ముస్లిం సంస్థలకు చుక్కెదురైంది. పురావస్తు విభాగం సర్వేకు వ్యతిరేకంగా ముస్లిం సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇలా మొత్తం ఐదు పిటిషన్లను కోర్టు కొట్టేసింది. అలాగే, ఆరునెలల్లో ఈ కేసులో విచారణ పూర్తిచేయాలని వారణాసి కోర్టుకు అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. అసలు ఈకేసు ఏంటో చూద్దాం. జ్ఞానవాపి మసీదులో శృంగార గౌరి ప్రతిమలు ఉన్నాయని హిందూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు.
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు కీలకతీర్పు ఇచ్చింది. ఈ కేసులో ముస్లిం సంస్థలకు చుక్కెదురైంది. పురావస్తు విభాగం సర్వేకు వ్యతిరేకంగా ముస్లిం సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇలా మొత్తం ఐదు పిటిషన్లను కోర్టు కొట్టేసింది. అలాగే, ఆరునెలల్లో ఈ కేసులో విచారణ పూర్తిచేయాలని వారణాసి కోర్టుకు అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. అసలు ఈకేసు ఏంటో చూద్దాం. జ్ఞానవాపి మసీదులో శృంగార గౌరి ప్రతిమలు ఉన్నాయని హిందూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. ఆ మసీదులో వాజుఖానా దగ్గర శివలింగం కూడా ఉందని వాదించాయి. కానీ అది వాటర్ ఫౌంటెయిన్ అని ముస్లిం సంస్థలు వాదించారు. ఈ మొత్తం వ్యవహారంపై సర్వే చేయాలని అలహాబాద్ హైకోర్టు- పురావస్తు విభాగాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు 1500 పేజీల నివేదికను పురావస్తు విభాగం- కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో హైకోర్టు తీర్పు తమకు లభించిన గొప్ప విజయమని హిందూ సంస్థల తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ చెప్పారు. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ, ముస్లిం సంస్థలు– సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.