Watch: డైలాగ్ వార్.. జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు కవిత కౌంటర్

Updated on: Sep 01, 2025 | 8:44 PM

Jagadeesh Reddy Vs K Kavitha: ఎమ్మెల్సీ కే కవిత చేసిన తాజా కామెంట్స్ బీఆర్ఎస్‌లో కాకరేపుతున్నాయి. శృతిమించితే.. పార్టీకి ఇబ్బంది కలిగితే.. ఎవరిమీదైనా యాక్షన్‌ ఉంటుందని పరోక్షంగా కవితను ఉద్దేశించి ఇటీవల మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ  వ్యాఖ్యలపై అదేస్థాయిలో రియాక్టయ్యారు కవిత. ఉంటే ఎంత? పోతే ఎంత? అంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు.

బీఆర్ఎస్‌లో కవిత ఎపిసోడ్ వేడి తారస్థాయికి చేరింది. కాలేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో హరీష్ రావు, సంతోష్ కారణంగానే కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందని ఆమె ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్‌లో కవిత కామెంట్స్ కాకరేపుతున్నాయి. శృతిమించితే.. పార్టీకి ఇబ్బంది కలిగితే.. ఎవరిమీదైనా యాక్షన్‌ ఉంటుందని ఇటీవల మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ  వ్యాఖ్యలపై అదేస్థాయిలో రియాక్టయ్యారు కవిత. ఉంటే ఎంత? పోతే ఎంత? అంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు. ఆ డైలాగ్‌వార్‌ని ఓసారి చూద్దాం.

Published on: Sep 01, 2025 08:44 PM