CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన తైవాన్ గ్రూప్ ప్రతినిధులు

Updated on: Dec 09, 2025 | 4:13 PM

గ్లోబల్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు. తైవాన్ గ్రూప్, ఐఐఎఫ్ఏ, టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్, ఫ్లూయిడ్రా, అట్మాస్ఫియర్ కోర్ ఇండియా ప్రతినిధులతో చర్చలు జరిగాయి. టూరిజంలో ఎంఓయూ కుదిరింది. హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటుకు కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఆసక్తి చూపింది.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు నిర్వహించారు. తెలంగాణను గ్లోబల్ స్టేజ్‌పైకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో జరుగుతున్న ఈ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సీఎం రేవంత్ ను తైవాన్ గ్రూప్ ప్రతినిధులు, ఐఐఎఫ్ఏ ప్రతినిధులు ప్రత్యేకంగా కలిశారు. టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులతోనూ సీఎం భేటీ అయ్యారు. స్పెయిన్‌కు చెందిన ఫ్లూయిడ్రా కంపెనీ ప్రతినిధులు, అట్మాస్ఫియర్ కోర్ ఇండియా ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా జానీ మాస్టర్ సతీమణి

డీప్‌ఫేక్ కంటెంట్.. టేక్ యాక్షన్.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

TVK సభకు గన్ తో వచ్చిన వ్యక్తి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

Gold Price Today: మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా

Mohammed Kaif: వాళ్లిద్దరూ లేకుండా కప్ గెలవలేం

Published on: Dec 09, 2025 04:11 PM