Big News Big Debate: చాలాకాలం తర్వాత ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒక్కటై గళమెత్తిన కాంగ్రెస్ నేతలు
ఉదయం నుంచీ గాంధీభవన్ వద్ద ఉద్రిక్తపరిస్థితులు తలెత్తాయి. పార్టీ ఆఫీస్ వద్దకు భారీగా వచ్చిన నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఉదయం నుంచీ గాంధీభవన్ వద్ద ఉద్రిక్తపరిస్థితులు తలెత్తాయి. పార్టీ ఆఫీస్ వద్దకు భారీగా వచ్చిన నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి BRS ఆఫీస్, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడి చేరుకున్న పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ క్రియేట్ అయింది. రాష్ట్ర నాయకత్వమంతా రోడ్డుపై భైటాయించి నిరసనలు తెలిపింది. అటు జిల్లాల్లోనూ పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సోదాల పేరుతో కాంగ్రెస్‌కు సంబంధించిన కీలక డేటాను పోలీసులు దోచుకెళ్లారని ఆరోపించారు హస్తం నేతలు. పోలీసులు చట్టవిరుద్దంగా వ్యవహరించారన్నది కాంగ్రెస్ ఆరోపణ. పోలీసుల యాక్షన్ వెనక స్టేట్, సెంటర్ రెండూ ఉన్నాయన్నది హస్తం పెద్దల అనుమానం.
Published on: Dec 14, 2022 07:04 PM