Big News Big Debate: మైనార్టీల మనసులో ఏముంది ?? ఏ పార్టీకి బలం.. దేనికి వ్యతిరేకం.. లైవ్ వీడియో

|

Nov 20, 2023 | 7:03 PM

తెలంగాణ ఎన్నికల్లో ముస్లింఓటర్లు అత్యంత కీలకం. 30కు పైగా నియోజకవర్గాల్లో గెలుపోటములు శాసించే స్తాయిలో ఉన్నారు. గడిచిన రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు అండగా ఉంటూ వచ్చిన మైనార్టీలు మూడోసారి తమ వెంటే అంటోంది అధికారపార్టీ. తమవైపు మొగ్గు చూపుతున్నారని నమ్ముతోంది కాంగ్రెస్‌ పార్టీ. రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్నారని చెబుతున్న ప్రధానపార్టీలు మైనార్టీల మద్దతు తమకేనంటూ ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో ముస్లింఓటర్లు అత్యంత కీలకం. 30కు పైగా నియోజకవర్గాల్లో గెలుపోటములు శాసించే స్తాయిలో ఉన్నారు. గడిచిన రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు అండగా ఉంటూ వచ్చిన మైనార్టీలు మూడోసారి తమ వెంటే అంటోంది అధికారపార్టీ. తమవైపు మొగ్గు చూపుతున్నారని నమ్ముతోంది కాంగ్రెస్‌ పార్టీ. రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్నారని చెబుతున్న ప్రధానపార్టీలు మైనార్టీల మద్దతు తమకేనంటూ ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ముస్లిం మైనార్టీల ప్రభావం ఎక్కువే.. 50 నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటర్లున్నారు. 25 నుంచి 30 చోట్ల గెలుపోటములను శాసించే స్థాయిలో జనాభా ఉంది. దీంతో పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మైనార్టీ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే మతపరంగా ఇచ్చిన మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించింది బీజేపీ. హిందుత్వ అజెండాతో వెళుతున్న కమలనాథులు పదేపదే రామరాజ్యం, అయోధ్య అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఉచితంగా అయోధ్య రాముడి దర్శనం కావాలంటే బీజేపీకి ఓటేయాలంటున్నారు బీజేపీ అగ్రనేతలు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అసలే కోతి.. పైగా పులితో పెట్టుకుంది.. చివరికి ??

Israel – Hamas: కాల్పుల విరమణకు హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య కీలక ఒప్పందం ??

NTR Memorial Coin: రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాలు..

మిస్ యూనివర్స్‌ 2023 గా నికరాగ్వా భామ..షేనిస్

అందర్ని ఆకర్షించేలా బియ్యపుగింజపై వరల్డ్‌ కప్‌, జాతీయ జెండా