Big News Big Debate: డిసెంబర్‌ లోపు ఎన్నికలు.. తెలంగాణలో పొలిటకల్ హైఅలర్ట్.. పార్టీల వ్యూహమేంటి..?

|

May 17, 2023 | 7:03 PM

తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి.. అక్టోబర్‌ తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని BRS ఇప్పటికే ప్రకటించింది. కర్నాటక ఫలితం తర్వాత సమయం లేదు మిత్రమా అంటూ పార్టీలన్నీ మరింత అలర్ట్‌ అయ్యాయి. వ్యూహాలపై ఫోకస్‌ పెట్టి రంగంలో దిగాలంటూ నాయకులను రెడీ చేస్తున్నాయి. బీఆర్ఎస్‌ పార్టీ ఎల్పీ సమావేశం పెట్టి కేసీఆర్‌ ప్రజాప్రతినిధులకు దేశానిర్దేశం చేస్తే.. అటు బీజేపీ ఈటలను హస్తినకు పిలిచి మరీ వ్యూహాలను రచిస్తోంది.

తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి.. అక్టోబర్‌ తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని BRS ఇప్పటికే ప్రకటించింది. కర్నాటక ఫలితం తర్వాత సమయం లేదు మిత్రమా అంటూ పార్టీలన్నీ మరింత అలర్ట్‌ అయ్యాయి. వ్యూహాలపై ఫోకస్‌ పెట్టి రంగంలో దిగాలంటూ నాయకులను రెడీ చేస్తున్నాయి. బీఆర్ఎస్‌ పార్టీ ఎల్పీ సమావేశం పెట్టి కేసీఆర్‌ ప్రజాప్రతినిధులకు దేశానిర్దేశం చేస్తే.. అటు బీజేపీ ఈటలను హస్తినకు పిలిచి మరీ వ్యూహాలను రచిస్తోంది. అటు కాంగ్రెస్‌ కూడా ఎన్నికలకు సిద్ధమంటున్నా ట్రోలింగ్‌ వ్యవహారంతో నాయకత్వంలో మళ్లీ రచ్చరచ్చ మొదలైంది.

అసలే సమయం తక్కువగా ఉంది.. పైగా కర్నాటకలో వచ్చిన ఫలితాలతో ఇక్కడ కూడా వ్యూహాలు మార్చుకోవాలని పార్టీలన్నీ భావిస్తున్నాయి. పథకాలు, వ్యూహాలు.. రాజకీయ ఎత్తుగడలు, పొత్తులు వంటి అంశాలపై తలమునకలయ్యాయి పార్టీలు.

హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసిన BRS వ్యతిరేక ఓటు తగ్గించే అంశంపై ఫోకస్‌ పెంచింది. మూడు నెలల్లో నియోజకవర్గంలో పనులన్నీ పూర్తి చేసి..మళ్లీ గెలిచేలా సిద్ధం కావాలని ఇప్పటికే నేతలకు హింట్ ఇచ్చారు సీఎం కేసీఆర్‌. మరోవైపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్న కేసీఆర్‌.. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ ప్రిపేర్ చేశారు. ఎన్నికలే లక్ష్యంగా కొత్త పథకాలు.. సరికొత్త వ్యూహాలతో బీఆర్ఎస్‌ అందరికంటే ముందే ఉంటుందని పార్టీ కేడర్‌ బలంగా నమ్ముతోంది.

కర్నాటక ఫలితంతో ఫుల్‌ జోష్‌తో ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని ట్రోలింగ్‌ వ్యవహారం కలవరపెడుతోంది. ఉత్తమ్‌ ఫిర్యాదుపై కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లో పోలీస్‌ సోదాలు సీనియర్ల అంతర్యుద్ధంలో భాగమేనంటూ ప్రచారం సాగుతోంది. అయితే తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని కలిసికట్టుగా పనిచేస్తామంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరో అడుగు ముందుకేసి తాను సీఎం రేసులో లేనంటూ షాకింగ్‌ న్యూస్‌ కూడా చెప్పారు. కాంగ్రెస్‌లో పదవి కోసం నేతల మధ్య వార్‌ లేదనే సందేశం జనాల్లోకి పంపే ప్రయత్నం చేశారు.

కర్నాటక ఫలితం వచ్చిన వెంటనే ఈటల రాజేందర్‌ ఢిల్లీకి వెళ్లడం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్ర పార్టీ చీఫ్‌ లేకుండానే ఈటల ఒక్కరే వెళ్లడంపై పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తప్పేం కాదని బండి సంజయ్‌ అంటున్నా.. బీజేపీ వ్యూహాలు మారుతున్నాయంటున్నారు.

మొత్తానికి కర్నాటక ఫలితం తర్వాత తెలంగాణలో అయితే పొలిటికల్‌ హీట్‌ వేవ్స్‌ బలంగా వీస్తున్నాయి. సమయం లేదు మిత్రమా అంటూ క్షేత్రంలో దిగిన పార్టీల్లో ప్రజామద్దతు ఎవరికో?