Big News Big Debate: సా ‘గరంగరం’ పాలిటిక్స్‌

|

Oct 16, 2022 | 7:58 PM

ఓ వైపు అమరావతి రైతుల పాదయాత్ర.. ఇంకోవైపు గర్జనతో ఏపీ రాజకీయాలు సాగం తీరం చుట్టే తిరుగుతున్నాయి. కేపిటల్‌ కహానీలో జనసేన ప్రవేశించగానే వార్ అంతా వైసీపీ వర్సెస్ పవన్ అన్నట్టుగా మారిపోయింది.

ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్రలో రాజకీయ యుద్ధం నడుస్తోంది. వైసీపీ గర్జనతో మొదలైన రగడ.. జనసేనకు నోటీసుల దాకా వెళ్లింది. వికేంద్రీకరణపై పవన్‌ వర్సెస్‌ వైసీపీ మాటల మంటలతో పొలిటికల్ తుఫాన్‌ వేరే లెవెల్‌కి వెళ్లిపోయింది. టాపిక్‌ ఏదైనా పంచాయితీ ఎక్కడైనా జనసేనాని ఎంటర్ అయితే అది పీక్స్ కు వెళ్లడం ఖాయం. ఓ వైపు అమరావతి రైతుల పాదయాత్ర.. ఇంకోవైపు గర్జనతో ఏపీ రాజకీయాలు సాగం తీరం చుట్టే తిరుగుతున్నాయి. కేపిటల్‌ కహానీలో జనసేన ప్రవేశించగానే వార్ అంతా వైసీపీ వర్సెస్ పవన్ అన్నట్టుగా మారిపోయింది. కాగా వికేంద్రీకరణపై నిన్న వైసీపీ గర్జన.. ఆపై ఎయిర్‌పోర్ట్ దగ్గర రాళ్లదాడితో సిట్యువేషన్‌ మొత్తం మారిపోయింది. ఆ వేడీ ఇవాళ కూడా కంటిన్యూ అయింది. జనసేనానిపై జేఏసీ నేతలు భగ్గుమన్నారు. పవన్ ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తున్నారంటూ నినాదాలతో హోరెత్తించారు. అలాగే జనవాణి నిర్వహిస్తే సమస్యలు వస్తాయని.. వాయిదా వేసుకోవాలని పవన్‌కు నోటీసులిచ్చారు పోలీసులు. అయితే వైసీపీ గర్జన ప్లాప్‌ కావడం తట్టుకోలేక తమపై అంక్షలు విధిస్తున్నారని పవన్ మండిపడ్డారు. ఇందులో భాగంగానే జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టారని ఆరోపించారు. పైగా అధికారంలో ఉన్న నేతలు గర్జనలు చేయడం ప్రశ్నించారాయన.

ఇక సేనాని కామెంట్లకు గట్టిగానే బదులిచ్చింది వైసీపీ. పవన్‌ ఓ రాజకీయ ఉగ్రవాదిలా మారారని ఘాటుగా విమర్శించారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌. మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అదేస్థాయిలో మండిపడ్డారు. అసలు ఉత్తరాంధ్రపై ఎందుకంత ద్వేషమో చెప్పాలన్నారు. ఓ వైపు గర్జన.. మరోవైపు జనవాణి కార్యక్రమాలతో విశాఖ హీటెక్కుతుందని ముందే ఊహించారంతా. అయితే అందరి అంచనాలకు మించి రాజకీయం రాజుకుంది. స్టీల్‌ సిటీలో మొదలైన రాజకీయ తుఫాన్ ఎప్పుడు ఎలా తీరం దాటుతుందో చూడాలి.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published on: Oct 16, 2022 07:58 PM