Watch: కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధం.. అసద్ కీలక వ్యాఖ్యలు

|

Oct 12, 2024 | 2:14 PM

Maharashtra Assembly Elections: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో చర్చలకు సిద్ధమన్నారు. నరేంద్ర మోదీని ఓడించాలంటే కాంగ్రెస్‌ అందరితో కలవాలని సూచించారు. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి చర్చలకు తాము సిద్ధమని కాంగ్రెస్‌కు లేఖ కూడా రాశామని వెల్లడించారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో చర్చలకు సిద్ధమన్నారు. నరేంద్ర మోదీని ఓడించాలంటే కాంగ్రెస్‌ అందరితో కలవాలని సూచించారు. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి చర్చలకు తాము సిద్ధమని కాంగ్రెస్‌కు లేఖ కూడా రాశామని వెల్లడించారు. చర్చలకు కాంగ్రెస్ ముందుకు రాకపోతే మా దారి మేం చూసుకుంటామన్నారు. ఎంఐఎం బీజేపీకి బీ టీమ్ అంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చేసే విమర్శలను అసద్ మరోసారి కొట్టిపారేశారు. తాము హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో లేకున్నా.. అక్కడ నరేంద్ర మోదీ అడ్డదారిలో గెలిచారని అన్నారు. మరి అక్కడ కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. వికారాబాద్‌లో శుక్రవారంరాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బీజేపీని ఏమీ చేయలేదన్నారు.

కాగా మూసీ పేరుతో పేదలకు అన్యాయం చేయొద్దు అన్నారు ఒవైసీ. తోటలు, ఫామ్‌హౌస్‌ల పేరిట బడాబాబులు ఆక్రమిస్తే రేవంత్‌ సర్కార్‌ మాత్రం పేదల వెంట పడుతోందని మండిపడ్డారు. మీరు తీసుకునే నిర్ణయాలు దొరలకు కాదు.. పేదవాడికి న్యాయం జరిగేలా ఉండాలన్నారు.

Published on: Oct 12, 2024 02:09 PM