Watch Video: జగన్ పోవాలంటున్న పవన్ ఎవరు రావాలో చెప్పాలి.. మంత్రి అంబటి రాంబాబు సూటి ప్రశ్న

|

Jul 01, 2023 | 2:56 PM

విజయం లేని, రాని రాజకీయ పార్టీ జనసేన అంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. జనసేన వారాహి విజయ యాత్ర పేరులో మాత్రమే విజయం ఉందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే చంద్రబాబుకు జనసేన అమ్ముడు పోయిందంటూ ఆరోపించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేసి అధికారంలోకి వస్తారా అని ప్రశ్నించారు.

భీమవరం సభలో YCP నేతలను ఉద్దేశించి పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో చీడపురుగని, మ్యాడ్‌ డాగ్‌ అని విమర్శించారు. విజయం లేని, రాని రాజకీయ పార్టీ జనసేన అంటూ ఎద్దేవా చేశారు. జనసేన వారాహి విజయ యాత్ర పేరులో మాత్రమే విజయం ఉందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే చంద్రబాబుకు జనసేన అమ్ముడు పోయిందంటూ ఆరోపించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేసి అధికారంలోకి వస్తారా అని ప్రశ్నించారు. జగన్ పోవాలంటున్న పవన్.. ఎవరు రావాలో చెప్పాలన్నారు. జగన్ పోతే సంక్షేమ పథకాలన్నీ పోతాయని.. అందుకే జన్ పోవాలన్న వాడే పోవాలన్నారు. చెప్పు తీసి చూపించడం, వైసీపీ నాయకులు, కార్యకర్తలను తిట్టడం పాలసీనా..? ప్రజా సమస్యనా? అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Published on: Jul 01, 2023 02:55 PM