Watch Video: వైసీపీ నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు.. టీడీపీకి సజ్జల వార్నింగ్

|

Apr 20, 2024 | 4:54 PM

మంగళగరిలో వైసీపీ కార్యకర్త వెంకటరెడ్డి మృతదేహానికి ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల నివాళులర్పించారు. లోకేష్‌ నామినేషన్‌ వేస్తున్న సమయంలో జరిగిన గొడవలో వెంకటరెడ్డి మృతి చెందారు. వైసీపీ కార్యకర్త వెంకటరెడ్డిని టీడీపీ కార్యకర్తలు బైక్‌తో ఢీకొట్టడంతో కిందపడి వెంకటరెడ్డి బ్రెయిన్‌డెడ్‌కి గురైయ్యారు. ఆయన మృతదేహానికి నివాళులర్పించిన సజ్జల రామకృష్ణా రెడ్డి..

మంగళగరిలో వైసీపీ కార్యకర్త వెంకటరెడ్డి మృతదేహానికి ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల నివాళులర్పించారు. లోకేష్‌ నామినేషన్‌ వేస్తున్న సమయంలో జరిగిన గొడవలో వెంకటరెడ్డి మృతి చెందారు. వైసీపీ కార్యకర్త వెంకటరెడ్డిని టీడీపీ కార్యకర్తలు బైక్‌తో ఢీకొట్టడంతో కిందపడి వెంకటరెడ్డి బ్రెయిన్‌డెడ్‌కి గురైయ్యారు. ఆయన మృతదేహానికి నివాళులర్పించిన సజ్జల రామకృష్ణా రెడ్డి.. వెంకటరెడ్డి కుటుంబీకులకు అండగా ఉంటామన్నారు. తెలుగుదేశం పార్టీ హింసా రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. మనుషుల ప్రాణాలు తీసేందుకు సైతం టీడీపీ నేతలు వెనకడుగు వేయడం లేదన్నారు. తాము ఎంతో సంయమనం, నిగ్రహంతో ఉన్నా టీడీపీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు. దండం పెట్టి చెబుతున్నాం, ఇప్పటికైనా హత్యలు, దాడులు ఆపాలన్నారు. ఆపకపోతే.. వైసీపీ నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరంటూ టీడీపీ నేతలను హెచ్చరించారు. దాడులు వాళ్ళే చేసి.. బాధితులంటూ ఎన్నికల కమిషన్‌కి పిర్యాదు చేస్తున్నారని మండిపడ్డారు. వైసిపి నేతలు అంతా సమయమనం కోల్పోవద్దనీ విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీకి ఇవి ఆఖరి ఎన్నికలు అన్నారు.