ఏపీలో ఇక.. 28 జిల్లాలు.. ఉనికిలోకి రానున్న 2 కొత్త జిల్లాలు
కొత్త జిల్లాలపై ఏపీ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పోలవరం, మార్కాపురం పేర్లతో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతోపాటు 17 జిల్లాల్లో 25 మార్పులకు తుదిరూపు ఇచ్చింది. ప్రజల కోరిక మేరకు డివిజన్లు, మండలాల మార్పులు జరిగాయని తెలిపింది. ఈ కొత్త మార్పులు, చేర్పులు 2025 జనవరి 1 నుండి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.
కొత్త జిల్లాలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటు 17 జిల్లాల్లో 25 మార్పులు చేస్తూ ఏపీ కొత్త మ్యాప్‌కు తుది రూపు ఇచ్చింది. ఏపీలో కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేసింది. 9 జిల్లాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని, 17 జిల్లాల్లో కొన్ని మార్పులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రజల కోరిక మేరకు డివిజన్లు, మండలాలు మార్చామని ప్రభుత్వం తెలిపింది. గత ప్రభుత్వం సరిగా ఆలోచించకుండా జిల్లాల విభజన చేసిందని కూటమి ప్రభుత్వం విమర్శించింది. పోలవరం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేసింది. గతంలోనే పారదర్శకంగా జిల్లా విభజన చేసుంటే ఈ సమస్యలు వచ్చేవి కావని మంత్రులు తెలిపారు. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం కలిపి జిల్లా చేశామని మంత్రులు వివరించారు. ఇక..తిరుపతిలో కలవాలని రైల్వేకోడూరు ప్రజలు ఎప్పట్నుంచో కోరుతున్నారని వారు తెలిపారు. బనగానపల్లె, అడ్డరోడ్డును డివిజన్లగా ఏర్పాటు చేస్తున్నామని, కొత్త మార్పులు, చేర్పులు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. అన్నమయ్య జిల్లా అలాగే ఉంటుందని, అయితే జిల్లా కేంద్రం మాత్రం మదనపల్లెగా ఉంటుందని వెల్లడించారు. ఇక రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలోకి మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆదోనిని రెండు మండలాలుగా విభజించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీవారి భక్తుల కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు
కనిగిరికి రైలు.. సాకారమైన 30 ఏళ్ళ కల
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
