Watch Live: కళ్లన్నీ సుప్రీంకోర్టు పైనే.. ఇవాళ ఏం జరగనుంది..? సర్వత్రా ఉత్కంఠ..
టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరిగిందని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును అరెస్టు చేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరిగిందని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును అరెస్టు చేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే తనపై నమోదు చేసిన స్కిల్ కేసును కొట్టివేయాలని చంద్రబాబు ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు నిరాకరించడంతో… చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధా బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ముందుకు రానుంది. ఇవాళ్టి జాబితాలో చివరి కేసుగా ఉంది చంద్రబాబు క్వాష్ పిటిషన్.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు గత నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇవాళ సుప్రీంకోర్ట్ ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది రాజకీయంగా ఉత్కంఠగా మారింది.
ఇదిలాఉంటే.. సుప్రీం కోర్టులో నేడు ఓటుకు నోటు కేసు విచారణ కూడా జరగనుంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..