PM Modi: ఆనందంగా ఉంది.. ఢిల్లీ ఐఐటీలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. లైవ్ వీడియో
Pm Modi Attends 57th Iit Delhi Convocation

PM Modi: ఆనందంగా ఉంది.. ఢిల్లీ ఐఐటీలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. లైవ్ వీడియో

Updated on: Aug 08, 2026 | 12:02 PM

న్యూఢిల్లీలోని ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 3,000 మందికి పైగా పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. వీరిలో 587 మంది పీహెచ్‌డీ పరిశోధకులు ఉన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు రాష్ట్రపతి స్వర్ణ పతకం, డైరెక్టర్ స్వర్ణ పతకం సహా పలు ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రధాని మోదీ ప్రదానం చేయనున్నారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) లో జరిగే 57వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన 3,000 మందికి పైగా పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఐఐటీ విద్యార్ధులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ మోదీ పేర్కొన్నారు. దీంతోపాటు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సోనిపట్ క్యాంపస్‌లో ఏఐ ఆధారిత అత్యున్నత పనితీరు గల సూపర్ కంప్యూటింగ్ కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఈ వేడుకలో 587 మంది పీహెచ్‌డీ పరిశోధకులతో సహా మొత్తం 3,000 మందికి పైగా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు.

ప్రధానమంత్రి మోదీ.. ప్రతిభావంతులైన విద్యార్థులకు వారి అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపుగా ఐఐటి ఢిల్లీ ప్రతిష్టాత్మక విద్యా పురస్కారాలను కూడా ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారాలలో రాష్ట్రపతి స్వర్ణ పతకం, డైరెక్టర్ స్వర్ణ పతకం, శంకర్ దయాళ్ శర్మ స్వర్ణ పతకం, పర్ఫెక్ట్ టెన్ స్వర్ణ పతకం ఉన్నాయి.

Published on: Aug 08, 2026 11:13 AM
Loading...
Unable to load recommendations.
Follow Us