Hyderabad: వామ్మో.. నగరంలో రెచ్చిపోతున్న దొంగలు.. క్షణాల్లో స్కూటీ మాయం..

హైదరాబాద్ నగరంలో దొంగతనాలు ఎక్కువైపోయాయి. రోజురోజుకీ ఈ చోరీలు చేసే మహానుభావుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎవరైనా గమనిస్తున్నారా లేదా దొరికిపోతే పరిస్థితి ఏంటనే ఆలోచన కూడా చాలా మందికి ఉండడం లేదు. ఈ మధ్య ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతి వీధిలో, ప్రతి ఇంటికీ సీసీ కెమెరాలు దర్శనమిస్తున్నాయి. అలా జాగ్రత్త పడినా సరే.. మాకేం సంబంధం అన్నట్లు దొంగతనాలు చేసేవాళ్లు వారి పని వాళ్లు చేసుకుంటూ పోతున్నారు. ఇక్కడ ఒక దొంగ ఏదో తన సొంతం అన్నంత దర్జాగా ఓ స్కూటీ నడిపించుకుంటూ తీసుకెళ్లిపోయాడు.

Hyderabad: వామ్మో.. నగరంలో రెచ్చిపోతున్న దొంగలు.. క్షణాల్లో స్కూటీ మాయం..

| Edited By: Srikar T

Updated on: Jun 13, 2024 | 11:05 AM

హైదరాబాద్ నగరంలో దొంగతనాలు ఎక్కువైపోయాయి. రోజురోజుకీ ఈ చోరీలు చేసే మహానుభావుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎవరైనా గమనిస్తున్నారా లేదా దొరికిపోతే పరిస్థితి ఏంటనే ఆలోచన కూడా చాలా మందికి ఉండడం లేదు. ఈ మధ్య ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతి వీధిలో, ప్రతి ఇంటికీ సీసీ కెమెరాలు దర్శనమిస్తున్నాయి. అలా జాగ్రత్త పడినా సరే.. మాకేం సంబంధం అన్నట్లు దొంగతనాలు చేసేవాళ్లు వారి పని వాళ్లు చేసుకుంటూ పోతున్నారు. ఇక్కడ ఒక దొంగ ఏదో తన సొంతం అన్నంత దర్జాగా ఓ స్కూటీ నడిపించుకుంటూ తీసుకెళ్లిపోయాడు. నగరంలోని చంద్రయాణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందుకు సంబంధించి కేసు నమోదైంది. ఓ ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న హీరో యాక్టివా బండిని గుర్తు తెలియని ఓ వ్యక్తి తీసుకెళ్లడం అక్కడి CCTV కెమెరాలో రికార్డు అయింది. చుట్టూ జనాలు తిరుగుతున్నా ఏ మాత్రం భయం లేకుండా స్కూటీ స్టార్ట్ చేసి తీసుకెళ్లిపోయాడు. దీని ఆధారంగా ఆ బండి ఓనర్ వెంటనే చంద్రయాణగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకు అన్ని వివరాలు చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow us
Latest Articles