Perni Nani: ‘ఆ విషయంలో.. ఎన్టీఆరే జగన్‌కి స్పూర్తి’
వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు అవ్వకపోవడంతో ఆ పార్టీ నేత పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ గతంలో అసెంబ్లీకి హాజరుకాని సందర్భాన్ని ఉదహరించారు. చంద్రబాబు నాయుడు రెండున్నరేళ్లు సభకు రానప్పటికీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు. సభలో లేని జగన్మోహనరెడ్డిపై కూటమి ఎమ్మెల్యేల అసభ్యకర వ్యాఖ్యలను ఖండించారు.
వైసీపీ అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై వైసిపి నాయకుడు పేర్ని నాని తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎన్.టి. రామారావు గారు 1989లో సుమారు 56-60 సీట్లు గెలిచినప్పటికీ, ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి వెళ్లి.. మళ్లీ రాను అని చెప్పి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నారా చంద్రబాబు నాయుడు రెండున్నర సంవత్సరాలు అసెంబ్లీకి రాలేదని, అయినప్పటికీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు. సభలో లేని జగన్మోహన్ రెడ్డి గురించి అసభ్యకరంగా మాట్లాడటం తప్పు అని చెప్పారు. మైకు ఇస్తే ప్రజా సమస్యలపై పోరాడతామని, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని.. అలా ఇచ్చే పరిస్థితి లేదని.. అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లడం లేదన్నారు.
Loading...
Unable to load recommendations.
Follow Us
