భార్యను లాడ్జ్‌కి తీసుకెళ్లాడు.. రాత్రంత్రా హ్యాపీగా ఉన్నారు.. ఉదయాన్నే బాత్‌రూంలో

Updated on: Oct 17, 2026 | 5:37 PM

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భార్య హత్య ఘటన కలకలం రేపింది. కర్ణాటకకు చెందిన నవీద్‌ భాషా, రుబియా సుల్తానా దంపతులు మదనపల్లిలోని ఓ లాడ్జ్‌లో బస చేశారు. గంజాయి వ్యాపారానికి సహకరించేందుకు భార్య నిరాకరించడంతో గతంలో గొడవలు జరిగినట్లు సమాచారం. జైలు నుంచి విడుదలైన తర్వాత భార్యను మదనపల్లికి తీసుకొచ్చిన భర్త, ఆమెను హత్య చేసినట్లు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు కథనం పేర్కొంది. ఈ ఘటనతో నలుగురు పిల్లలు తల్లిని కోల్పోయారు.

వాళ్లది అసలు కర్ణాటక.. మంచిగా బతుకుదామని భార్యను ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చాడు.. ఇల్లు చూద్దామంటూ భార్యను లాడ్జ్‌కి తీసుకెళ్లాడు… రాత్రంతా భార్యాభర్తలిద్దరూ హ్యాపీగా గడిపారు.. భర్త మాత్రం మనసులో దారుణమైన స్కెచ్ వేశాడు. సీన్ కట్ చేస్తే.తెల్లవారేసరికి అదే లాడ్జ్‌లోని బాత్రూమ్‌లో భార్య విగతజీవిగా పడి ఉంది.. భర్త అనుకున్న ప్తాన్ ప్రాకారం ఆమెను అతి క్రూరంగా కడతేర్చాడు.. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన ఈ భీకర హత్యోదంతం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కలచివేసింది.. 13 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే, గంజాయి వ్యాపారం చేస్తానంటే భార్య ఒప్పుకోకపోవడంతో.. కక్షతో భార్యను బీరు బాటిల్‌తో కొట్టి.. ఆపై పొడిచి చంపి… నేరుగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.. అసలు ఈ దారుణానికి దారితీసిన నేపథ్యం ఏంటి? ఆ హంతకుడు పన్నిన ప్లాన్ ఏంటి? ఈ రోజు వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. “వివరాల్లోకి వెళ్తే… కర్ణాటకలోని ముల్బాగల్ సమీపంలోని కురుప్పేటకు చెందిన నవీద్ భాషా, రుబియా సుల్తానా.. ఇద్దరిదీ పక్కపక్క గ్రామాలే. పదో తరగతి నుంచి పరిచయం కాస్తా ప్రేమగా మారి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే నవీద్ భాషా ఏ పని చేయకుండా ఖాళీగా తిరగడంతో కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఏడాదిన్నర క్రితం భర్తపై రుబియా సుల్తానా గృహహింస, వరకట్న వేధింపుల కేసు పెట్టింది. పెద్దలు పంచాయతీ చేసి రాజీ కుదిర్చినప్పటికీ… డబ్బుల కోసం నవీద్ భాషా ఏకంగా గంజాయి వ్యాపారంలోకి దిగాడు. ఇంట్లో కొనితెచ్చిన గంజాయిని.. చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసి విక్రయించడంలో తనకు సహకరించాలని భార్యను వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో మళ్లీ దాడి చేశాడు. దీంతో ఆమె మరోసారి పోలీసులను ఆశ్రయించగా… అటెంప్ట్ మర్డర్, గంజాయి దందా కేసులు నమోదు చేశారు.. ఆ తర్వాత నవీద్ ను జైలుకు పంపించారు.. ఆ తర్వాతే.. అసలు కథ మొదలైంది.. అయితే.. వారం రోజుల క్రితం జైలు నుంచి బయటికి వచ్చిన నవీద్ భాషా… భార్యను నమ్మించడానికి ఒక పక్కా ప్లాన్ వేసాడు.. ముల్బాగల్‌లో కేసులు ఉన్నాయి. ఇక్కడ పరువుగా బతకలేము.. మదనపల్లికి షిఫ్ట్ అవుదాం.. అక్కడ మనకు చుట్టాలున్నారు… అక్కడే కొత్త జీవితం మొదలు పెడదాం.. అద్దెఇల్లు వెతుకుదాం.. అంటూ నమ్మించి రుబియా సుల్తానాను మదనపల్లికి తీసుకువచ్చాడు. అయితే.. చుట్టాల ఇంటికి పోదామని భార్యను తీసుకువచ్చిన భాషా.. అలా చేయలేదు. ఆమెకు మాయమాటలు చెప్పి.. మదనపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్‌భవన్ లాడ్జ్‌లో రూమ్ తీసుకున్నాడు. ఆ రోజంతా ఇద్దరూ బయటకు వెళ్లి సంతోషంగా డిన్నర్ చేసి వచ్చారు. ఇద్దరూ హ్యాపీ ఉండటం చూసి లాడ్జ్ సిబ్బందికి కూడా ఎలాంటి అనుమానం రాలేదు. కానీ తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో రుబియా బాత్రూమ్‌కు వెళ్లిన సమయాన్ని నవీద్.. తనకు అనుకూలంగా మలుచుకున్నాడు.. ప్లాన్ ను అమలు చేశాడు.. ఆమె బాత్రూంలోకి వెళ్లగానే.. వెనుక నుంచి వెళ్లి.. ఖాళీ బీరు బాటిల్‌తో రుబియా తలపై బలంగా కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. ఆ తర్వాత అదే బీరు బాటిల్ గాజు ముక్కతో గొంతు కోసి కిరాతకంగా హతమార్చాడు.. అనంతరం.. తెల్లవారుజామున 5 గంటల సమయంలో లాడ్జ్ సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి గేటు తాళాలు తీయించుకుని బయటికి వెళ్లిన నవీద్… నేరుగా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగినదంతా చెప్పాడు.. భార్యను తానే చంపానంటూ లొంగిపోయాడు.. పోలీసులు వెంటనే లాడ్జ్‌కు చేరుకుని మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.. భార్యను నమ్మించి హత్య చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో రుబియా.. నలుగురు పిల్లలు తల్లి లేని వారిగా మిగిలిపోయారు.. కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.. ఇలాంటి నేరాలు సమాజంలో ఎంతటి భయాందోళనలను సృష్టిస్తున్నాయో మనం ఇప్పటికే చూస్తున్నాం.. ఈ ఘోర ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jabardasth Actor Babu: వా.. బాబు..! జబర్దస్త్‌ కమెడియన్ TO సక్సెస్‌ఫుల్ డైరెక్టర్!

Anupama Parameswaran: పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది! అనుపమ బోల్డ్ కామెంట్స్

Khushboo: ఐదు పదుల వయసులోనూ.. నటి ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!

థెరపీ చేయించుకుంటే ఇన్సూరెన్స్ ఇస్తారా?హెల్త్ పాలసీ తీసుకోబోయేముందు ఈ నిజాలు తెలుసుకోండి!

రూ.20 వేల జీతంతోనూ పర్సనల్ లోన్.. అర్హతలు ఏమిటి? ఎంతొస్తుందో తెలుసా?

Loading...
Unable to load recommendations.
Follow Us