KNOW THIS Bullet Flight Video: దూసుకొస్తున్న బుల్లెట్ విమానం… వైమానిక రంగంలో విప్లవం తీసుకురానుందా..?(వీడియో)

|

Feb 03, 2022 | 10:01 PM

ఇప్పటి వరకూ మనకు బుల్లెట్ రైళ్లు మాత్రమే తెలుసు.. అవి ఎంత వేగంగా దూసుకెళతాయో కూడా తెలుసు. ఇప్పుడు బుల్లెట్‌ విమానాలు రాబోతున్నాయి. ఒట్టో ఏవియేషన్ అనే అమెరికా స్టార్టప్ కంపెనీ ఈ కొత్త రకం విమానాన్ని రూపొందించింది.


ఇప్పటి వరకూ మనకు బుల్లెట్ రైళ్లు మాత్రమే తెలుసు.. అవి ఎంత వేగంగా దూసుకెళతాయో కూడా తెలుసు. ఇప్పుడు బుల్లెట్‌ విమానాలు రాబోతున్నాయి. ఒట్టో ఏవియేషన్ అనే అమెరికా స్టార్టప్ కంపెనీ ఈ కొత్త రకం విమానాన్ని రూపొందించింది. దీనికి ఒట్టో సెలెరా 500ఎల్ అని నామకరణం చేసింది. ఇది చూడ్డానికి కోడిగుడ్డు, గాలిబుడగ, బుల్లెట్ లాంటి ఆకారంలో ఉంటుంది.. అందుకే దీన్ని ఏ ఇతర విమానంతోనూ పోల్చలేం. ఇది ముందుకు దూసుకెళుతున్నప్పుడు గాలి దీని ఉపరితలాన్ని చాలా తక్కువ స్థాయిలో నిరోధించేలా డిజైన్ ఉంటుంది. తద్వారా విమానం వేగంగా ప్రయాణించడమే కాదు, ఇంధన వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది.

ఇతర టర్బో ప్రొపెల్లర్ విమానాలతో పోల్చితే ఇదినాలుగు రెట్లు ఇంధనం పొదుపు చేస్తుంది. అదే జెట్ విమానంతో పోల్చితే ఏడు నుంచి ఎనిమిది రెట్లు ఇంధనం పొదుపు చేస్తుందని ఒట్టో ఏవియేషన్ సీఈఓ విలియం ఒట్టో జూనియర్ తెలిపారు. ఈ బుల్లెట్ విమానంలో ఆరుగురు ప్రయాణించే వీలుంటుంది. ఇదే సైజున్న బిజినెస్ క్లాస్ విమానంలో ఒక గంట ప్రయాణించేందుకు 2,100 డాలర్లు ఖర్చవుతుండగా, ఈ ఒట్టో సెలెరా 500ఎల్ విమానంలో ఒక గంట ప్రయాణానికి 328 డాలర్లు ఖర్చవుతుంది. గంటకు 460 మైళ్ల వేగంతో ప్రయాణించే ఈ విమానంలో ఒక్కసారి ఇంధనం నింపుకుంటే 4,500 మైళ్లు ప్రయాణించగలదు. విలియం ఒట్టో సీనియర్ రూపొందించిన ఈ విమానం ప్రస్తుతం ఇది తుది మెరుగులు దిద్దుకుంటోంది. 2025 నాటికి వినియోగంలోకి తెచ్చేందుకు ఒట్టో ఏవియేషన్ శ్రమిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఈ విమానానికి ఓ డీజిల్ ఇంజిన్ కూడా అమర్చారు. అయితే భవిష్యత్తులో పర్యావరణ హితం కోరి విద్యుత్ లేదా హైడ్రోజన్ ఇంజిన్ అమర్చాలని వారు భావిస్తున్నారు. ఒక్కో బుల్లెట్ ప్లేన్ ధర 5 మిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అమెరికా వైమానిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Published on: Feb 03, 2022 08:39 PM