Benefits of Walnuts: వాల్‌నట్స్‌తో ఎన్ని లాభాలో… వాల్‌ నట్స్‌ని ఇలా తిన్నారంటే.. అస్సలు వదలరు.!(వీడియో)

|

Oct 09, 2021 | 9:33 PM

ప్రస్తుత కాలంలో డ్రైఫ్రూట్స్‌ని ప్రాధాన్యత బాగా పెరిగింది. ఆరోగ్య రిత్యా వైద్యులు, ఆహార నిపుణులు కూడా వీటిని సజెస్ట్‌ చేస్తున్నారు. అయితే వేటివల్ల ఎలాంటి లాభాలుంటాయి, వాటిని ఎలా తినాలి? అవి ఆరోగ్యానికి ఏవిధంగా సహాయపడతాయో తెలుసుకొని తింటే ఇంకా మంచిది కదా...

ప్రస్తుత కాలంలో డ్రైఫ్రూట్స్‌ని ప్రాధాన్యత బాగా పెరిగింది. ఆరోగ్య రిత్యా వైద్యులు, ఆహార నిపుణులు కూడా వీటిని సజెస్ట్‌ చేస్తున్నారు. అయితే వేటివల్ల ఎలాంటి లాభాలుంటాయి, వాటిని ఎలా తినాలి? అవి ఆరోగ్యానికి ఏవిధంగా సహాయపడతాయో తెలుసుకొని తింటే ఇంకా మంచిది కదా… అయితే ఇప్పడు మీకు ఒక అద్భుతమైన డ్రైప్రూట్‌ గురించి చెప్పబోతున్నాం. దీనివల్ల వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంతోపాటు ఫిట్‌నెస్‌ను కూడా మీసొంతం చేసుకోవచ్చు. అదేంటంటే…

వాల్‌ నట్స్‌.. ఇవి అందరికీ తెలిసినవే.. అయితే వీటిని ఎలా తినాలి అనేది పాయింట్‌.. వాల్‌నట్స్‌లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, ప్లాంట్ కాంపౌండ్స్, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. రోజూ వాల్ నట్స్ తినడం వల్ల మెదడు చాలా షార్ప్‌గా పనిచేస్తుంది. వాల్‌నట్స్ మన శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. అంతేకాదు గుండెకు కూడా ఎంతో బలాన్నిస్తాయి. రాత్రిపూట 4 లేదా 5 వాల్‌నట్స్‌ను నీళ్లలో నానబెట్టి, ఉదయం ఒక కప్పు పెరుగుతో కలిపి తినాలి. ఇంకా కావాలంటే వీటికి ఓట్స్‌ కూడా యాడ్‌ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దానిలో పోషక విలువలు మరింత పెరుగుతాయి.

సాయంత్రం వేళ ఆకలిని తీర్చడానికి కుకీలు, జంక్‌ఫుడ్‌కి బదులుగా, కొన్ని వాల్‌నట్స్‌ను తీసుకోండి. వాల్‌నట్స్‌లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వాల్‌ నట్స్‌ను సలాడ్స్‌తో కూడా కలిపి తీసుకోవచ్చు, ఇది సలాడ్‌లోని పోషకాలను పెంచుతుంది. వీటిని డిప్స్, సాస్‌లలో కూడా ఉపయోగించవచ్చు. వాల్‌నట్‌లను గ్రైండ్ చేసి చేపలు, చికెన్‌పై పూతలా రాసి ఫ్రై చేసుకోవచ్చు. ఇది రుచిని పెంచడమే కాకుండా పోషక విలువలను కూడా పెంచుతుంది. వాల్‌నట్స్‌లో ఇతర గింజల కంటే ఎక్కువ ఒమేగా -3 ఉంటుంది. ఇది గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మెదడు పనితీరును పెంచడంలోనూ సహాయపడుతుంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Covid Crisis Support: తల్లిదండ్రులను కోల్పోయిన స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్స్..ఎక్కడ..ఎలా?(వీడియో)

 Maa Elections 2021: నాగబాబు వ్యాఖ్యలకు మంచు విష్ణు కౌంటర్.. రేపటి పోరులో ఎం జరగనుంది..(లైవ్ వీడియో)

 Road accidents: ప్రాణదాతలకు 5 వేలు పారితోషికం.. కేంద్రం కొత్త పథకం..! వివరాలు ఇలా..(వీడియో)

 CVL Narasimha Rao on Maa Elections 2021: క్లైమాక్స్‌కు చేరుకున్న’మా’.. సీవీఎల్‌ నరసింహరావు మరో సంచలన నిర్ణయం..

Follow us on