పాకిస్తాన్ ను వణికించే విధంగా త్రివిధ దళాల త్రిశూల్ విన్యాసాలు

Updated on: Nov 05, 2025 | 3:40 PM

పశ్చిమ సరిహద్దులో భారత త్రివిధ దళాలు త్రిశూల్ పేరుతో భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పాల్గొన్న ఈ బల ప్రదర్శన పాకిస్తాన్‌ను వణికించింది. స్వదేశీ డ్రోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా తయారైన ఈ డ్రోన్‌లు, ఆపరేషన్ సింధూర్‌లో కీలక పాత్ర పోషించాయి. పాకిస్తాన్ గగనతల ఆంక్షలు విధించే స్థాయికి భయపడింది.

పశ్చిమ సరిహద్దులో భారత త్రివిధ దళాలు త్రిశూల్ పేరుతో భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు పాల్గొంటున్న ఈ బల ప్రదర్శన పాకిస్తాన్‌ను తీవ్రంగా వణికించింది. త్రిశూల్ విన్యాసాల నేపథ్యంలో, పాకిస్తాన్ తన గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటమ్ జారీ చేసింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు పాక్ సరిహద్దులోని సర్క్రీక్ ప్రాంతంతో పాటు రాజస్థాన్‌లోని థార్ ఎడారి, గుజరాత్, అరేబియా సముద్ర తీరంలో ఈ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ విన్యాసాలలో స్వదేశీ డ్రోన్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలలో కార్తీక శోభ

Patna: పాట్నాలో భారీగా ట్రాఫిక్ జామ్

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్

ఎదురెదురుగా ఢీకొన్న RTC బస్సు, కారు

ఉమెన్‌ టీమిండియాపై సినీ సెలబ్రిటీల ప్రశంసల వ‌ర్షం..

Loading...
Unable to load recommendations.
Follow Us