మీ పిల్లలకు ఐస్‌క్రీమ్ కొనిస్తున్నారా? ఈ భయంకర వ్యాధులు తప్పవు!

Updated on: Apr 11, 2025 | 5:53 PM

ఈ రోజుల్లో రెస్టారెంట్ కు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి. బిర్యానీలో బొద్దింక కేసులు ఎక్కువ కావడం ఓ కారణం అయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టి ఇంటికి తెప్పించుకునే ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌లోనూ సమస్యే. రవ్వలో పురుగులు, బ్రెడ్‌పై ఫంగస్‌, ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు. కొన్ని బ్రాండెడ్‌ కంపెనీలకి కాసుల ధ్యాసే తప్ప ప్రజల ఆరోగ్యం పట్టదా? ఈ రోజు వరల్డ్‌ హెల్త్‌ డే.

ఈ సందర్బంగా ఎంతో నమ్మదగ్గవి అనుకునే బ్రాండెడ్‌ పాకేజ్డ్‌ ఫుడ్స్‌లో సమస్యలపైనా 40 వేల మంది పాల్గొన్న లోకల్ సర్కిల్స్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫాం సర్వేలో బయటపడ్డ షాకింగ్ నిజాలపైనా మాట్లాడుకుందాం. బ్రాండెడ్‌ పాకేజ్డ్‌ ఫుడ్స్‌ ధర ఎక్కువ. వాటికి కల్తీలు పుట్టుకొస్తున్నా కట్టడి చేసే వారే లేరు. కాసుల కోసం కక్కుర్తి పడి నాణ్యతని గాలికొదిలేస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు వేసవిలో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ లో కల్తీ. చాలా చోట్ల ఐస్ క్రీమ్ ల తయారీ కేంద్రాలు దారుణంగా ఉంటాయి. అపరిశుభ్రత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఐస్ తయారీలో ఉపయోగించే రంగులు, పదార్థాలు, నీళ్లు నాసిరకంగా ఉంటాయి. అయితే ఓ చోట ఐస్ క్రీమ్ తయారీలో అత్యంత ప్రమాదకరమైన డిటర్జెంట్ పౌడర్లు కలిపారు. కర్నాటకలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ విషయం బయటపడింది. క్రీమీ టెక్స్చర్ కోసం డిటర్జెంట్ పౌడరా? ఎంత దారుణం. అంతేకాదు కూల్ డ్రింక్స్‌ లోనూ ఎముకలను బలహీనపరిచే ఫాస్పోరిక్ ఆమ్లాన్ని గుర్తించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైట్‌ రైస్‌కి బదులుగా ఓట్స్‌ తింటున్నారా ?? జరిగేది ఇదే..

రైలు ప్రయాణికులకు షాకింగ్‌ న్యూస్‌.. ఇకపై అలా కుదరదు..

మంచం తో కారు తయారుచేసి.. రోడ్డుపై తిరిగిన వ్యక్తి.. కట్ చేస్తే షాకిచ్చిన పోలీసులు

అమ్మకానికి కన్యత్వం.. రూ. 18 కోట్లకు కొన్న స్టార్‌ హీరో

‘నా బిడ్డ క్షేమంగా ఇంటికొచ్చాడు..’ చిరు ఎమోషనల్ ట్వీట్