ఐ ఎస్ సదన్.. కత్తులతో రౌడీ షీటర్ నసీర్ హల్ చల్
హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రు నగర్ కాలనీలో రౌడీ షీటర్ నసీర్ కత్తులతో వీరంగం సృష్టించాడు. రోడ్డుపై కనిపించిన వారిపై దాడికి ప్రయత్నించి, పలు వాహనాలను ధ్వంసం చేశాడు. పోలీసులు రాగానే సంఘటనా స్థలం నుండి పారిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ నసీర్ వీరంగం సృష్టించాడు. నెహ్రు నగర్ కాలనీలో కత్తులు పట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. రోడ్డుపై కనిపించిన వారిపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. అంతేకాకుండా, నసీర్ పలు వాహనాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వీధుల్లో నడిరోడ్డుపై రౌడీ షీటర్ హంగామాతో స్థానికులు హడలిపోయారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభం
Alia Bhatt: ఇంట్రస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన ఆలియా
సొంత సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తున్న హీరోయిన్లు
