పాతబస్తీలో ఏనుగు బీభత్సం.. భయంతో పరుగులు తీసిన జనం!
హైదరాబాద్ పాతబస్తీలో గియార్వి షరీఫ్ వేడుకల సందర్భంగా ఏనుగు ఒక్కసారిగా బెదిరి అదుపుతప్పింది. బ్యాండ్ బాజా శబ్దాలు పెరగడంతో చార్మినార్ పరిసరాల్లో పరుగులు తీసింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు ఏనుగు ఊరేగింపును రద్దు చేశారు. అనంతరం ఏనుగును మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ప్రత్యేక లారీలో కర్ణాటకలోని గుల్బర్గాకు భారీ పోలీసు బందోబస్తు మధ్య తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
హైదరాబాద్ పాతబస్తీలో గియార్వి షరీఫ్ వేడుకల సందర్భంగా ఒక్కసారిగా కలకలం రేగింది. వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా ముస్తాబు చేసి తీసుకొచ్చిన ఏనుగు.. బ్యాండ్ బాజా శబ్దాలకు బెదిరి అదుపుతప్పింది. దీంతో రోడ్డుపై ఉన్న జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఇరుకైన గల్లీల్లో పరుగులు తీశారు. చార్మినార్ పరిసరాల్లోని ఇరానీ గల్లీ నుంచి ఏనుగు ఊరేగింపు ప్రారంభమైంది. అంతా ప్రశాంతంగా సాగుతోందనుకున్న సమయంలో బ్యాండ్ బాజా మోత ఒక్కసారిగా పెరగడంతో ఏనుగు బెదిరిపోయింది. అదుపుతప్పి కొంతదూరం వేగంగా పరుగులు తీసింది. దీంతో ఊరేగింపులో పాల్గొన్నవారితో పాటు రోడ్లపై ఉన్న స్థానికులు కూడా భయంతో పరుగులు పెట్టారు. ఒక్కసారిగా అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఘటన గురించి సమాచారం అందుకున్న చార్మినార్ జోన్ డీసీపీ ఖారే కిరణ్ ప్రభాకర్, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీఖర్ అలీ వెంటనే అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఏనుగు ఊరేగింపును నిలిపివేయాలని నిర్ణయించారు. దీంతో గియార్వి షరీఫ్ వేడుకల్లో ఏనుగుతో నిర్వహించాల్సిన ఊరేగింపు రద్దయింది. అనంతరం ఒంటెలతో ఊరేగింపును కొనసాగించారు. మరోవైపు కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన ఈ ఏనుగును తిరిగి అక్కడికి పంపించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జూ అధికారులు ఏనుగుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, ప్రత్యేక లారీలోకి ఎక్కించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య గుల్బర్గాకు తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వేడుకల కోసం తీసుకొచ్చిన ఏనుగు ఇలా ఒక్కసారిగా బెదిరిపోవడం పాతబస్తీలో చర్చనీయాంశంగా మారింది. భారీ శబ్దాలు, జనసందోహం మధ్య జంతువులతో ఊరేగింపులు నిర్వహించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉసిరి ఆరోగ్యానికి మంచిదే అయినా.. వీరికి మాత్రం విషంతో సమానం!
వాట్సాప్, టెలిగ్రామ్‌లకు కొత్త రూల్స్
పిల్లల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఏఐ సెక్యూరిటీ!
ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా.. గుండెకు ముప్పు తప్పదు!
ఈ గింజలు గుప్పెడు తింటే చాలు.. పండ్లు, పాలు కంటే 5 రెట్లు ఎక్కువ శక్తి!
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
ప్రశ్నించిన పాపానికి ప్రాణాల మీదకు వచ్చింది..!
అర్ధరాత్రి హాస్టల్లో కలకలం.. 10 మంది అమ్మాయిల జడలు కట్

