వామ్మో.. ఏ ఫ్యాక్టరీలో ఏం జరుగుతోందో.. చర్లపల్లి డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం
ఏ ఫ్యాక్టరీలో ఏం జరుగుతోంది.. పర్మిషన్లు ఉన్నవెన్ని.. నిబంధనలు ఉల్లంఘించినవెన్ని.. ఈ లెక్కంతా ఏదో ఒక గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్ దగ్గర పక్కాగా ఉండాలి.. కానీ.. వాగ్దేవి అరాచకం బయటపడిన తీరు చూస్తే.. తనిఖీల్లాంటివి రెగ్యులర్‌గా జరగడం లేదనే విషయం క్లియర్ గా స్పష్టమవుతోంది.
ఏ ఫ్యాక్టరీలో ఏం జరుగుతోంది.. పర్మిషన్లు ఉన్నవెన్ని.. నిబంధనలు ఉల్లంఘించినవెన్ని.. ఈ లెక్కంతా ఏదో ఒక గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్ దగ్గర పక్కాగా ఉండాలి.. కానీ.. వాగ్దేవి అరాచకం బయటపడిన తీరు చూస్తే.. తనిఖీల్లాంటివి రెగ్యులర్‌గా జరగడం లేదనే విషయం స్పష్టమవుతోంది. డ్రగ్స్ దొరికిన యూనిట్ చర్లపల్లిలో కొత్తగా ఏర్పాటు అయిన ఇండస్ట్రియల్ కాలనీలో ఉండటం వల్ల అక్కడేం జరుగుతోందో తమ దృష్టికి రాలేదంటున్నారు అధికారులు. వాగ్దేవిలో నలుగురు మాత్రమే పనిచేస్తున్నారని, పర్మిషన్ ఉండాలంటే 10 మంది వర్కర్స్ ఉండాలంటున్నారు. నిబంధనల ఉల్లంఘన ఉందని చెప్తున్నారు. వాగ్దేవి ఫ్యాక్టరీపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామంటున్నారు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీధర్..
చర్లపల్లిలోని వాగ్దేవి లాబొరేటరీస్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌కు ఎలాంటి అప్లికేషన్ పెట్టుకోలేదంటున్నారు అధికారులు. నాచారంలోని కంపెనీ యూనిట్‌కి మాత్రం గతంలో అనుమతి తీసుకున్నారని, పీసీబీ పర్మిషన్ లేకపోవడంతో ఫ్యాక్టరీ లైసెన్స్ రెన్యువల్ కాలేదంటున్నారు. వాగ్దేవి నాచారం యూనిట్ లైసెన్స్ ఓలేటి శ్రీనివాస్ పేరు మీద లేదని.. దువ్వూరి సుబ్రహ్మణ్యం దగ్గరి నుంచి లీజ్‌కు తీసుకున్నాడా లేక ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడో తెలియాల్సి ఉందంటున్నారు ఫ్యాక్టరీస్ అధికారులు.
