అరకులో హాట్‌ ఎయిర్‌ బెలూన్స్‌.. 300 అడుగుల ఎత్తునుండి అందాలు వీక్షించే అవకాశం

|

Oct 27, 2024 | 9:16 PM

ఆంధ్రా ఊటి అరకులోయలో పర్యాటకులు ఇక 'గాల్లో తేలినట్టుందే..' అనాల్సిందే..! ఎందుకంటే టూరిస్టులకు మరో అద్భుత అనుభూతినిచ్చే ప్రాజెక్ట్ అందుబాటు లోకి వచ్చేసింది. అదే.. హాట్ ఎయిర్ బెలూన్..! అరకు లోయలో హాట్ ఎయిర్ బెలూన్స్ అందుబాటులోకి వచ్చాయి. విదేశాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఉండే హాట్ ఎయిర్ బెలూన్స్.. ఇప్పుడు అరకులోయ సందర్శకుల కోసం సిద్ధమయ్యాయి.

మంగళవారం నుంచి పర్యాటకులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే విజయదశమినాడు సక్సెస్ ఫుల్ గా ట్రైల్ రన్ పూర్తి చేసుకుంది. ఐ టి డి ఏ పి ఓ అభిషేక్ స్వయంగా పర్యవేక్షించారు. నిపుణుల సలహాలు సూచనలతో ప్రాజెక్టు ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పద్మావతి గార్డెన్స్ లో పర్యాటకులకు అందుబాటులో హాట్ ఎయిర్ బెలూన్స్ ఉన్నాయి. అరకులోయ పర్యాటకులకు గాలిలో విహరించే ప్రత్యేక అనుభూతి ఇస్తుంది ఈ హాట్ ఎయిర్ బెలూన్. శీతాకాలం వచ్చిందంటే.. అరకు ప్రకృతి అందాలు అమాంతంగా పెరిగిపోతాయి. సుందర దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఆ కొండలు లోయలు పొగ మధ్యలో గాల్లో వివరిస్తే ఆ అనుభూతే వేరు. అటువంటి అనుభూతిని కల్పిస్తుంది ఈ హార్ట్ ఎయిర్ బెలూన్. అరకు సందర్శించే పర్యాటకులు సుందరమైన లోయలు, పచ్చని కొండల మధ్య ఒక నిర్దిష్ట ఎత్తులో హాట్-ఎయిర్ బెలూన్ రైడ్‌ను అనుభూతి పొండవచ్చు. ఆంద్రప్రదేశ్‌లో పర్యాటక ప్రదేశాలపై మరింత ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. అరకులోయలో మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు అందుబాటులోకి తెస్తోంది.అరకు లోయకి ఏటా సుమారు మూడు లక్షల మంది వరకు పర్యాటకులు వస్తుంటారు. హాట్‌ బెలూన్‌.. సుమారు 300 అడుగుల మేర పర్యాటకులను పైకి తీసుకువెళ్లి మళ్లీ కిందకి దించుతుందని అన్నారు పీవో అభిషేక్. అంతేకాదు, అందాల అరకులోయలో అడ్వెంచర్ టూరిజాన్ని పరిచయం చేస్తున్నామని అన్నారు నిర్వాహకుడు సంతోష్. ఐటీడీఏతో కలిసి.. గత పదిరోజులుగా హార్ట్ ఎయిర్ బెలూన్స్ ట్రైల్ రన్స్ నిర్వహిస్తూనే.. అన్ని భద్రతా ప్రమాణాలతో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. త్వరలో పారా మోటరింగ్ కూడా ప్రారంభిస్తామన్నారు సంతోష్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందేళ్ల తర్వాత హైదరాబాద్‌లో.. కొత్తగా అతిపెద్ద రైల్వేస్టేషన్‌

Ghee Coffee: కొవ్వు తగ్గాలంటే ఘీ కాఫీ

బిగ్‌ బాస్‌లో.. టెర్రర్ పుట్టించిన గంగవ్వ దెబ్బకు కంటెస్టెంట్స్‌ హడల్

తన భార్యపై వెకిలి కామెంట్స్‌ చేసినవారికి మాటలతో ఇచ్చి పడేసిన మణికంఠ

మరో చిన్నారికి ప్రాణం పోసిన దేవుడు !! మహేష్ పై ఫ్యాన్స్‌ ప్రశంసలు

Follow us on