Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 5 రోజులు భారీ వర్షాలు.

|

Sep 29, 2023 | 6:37 PM

హైదరాబాద్‌ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, బంజారాహిల్స్, అమీర్ పేట్ , పాతబస్తీ, చార్మినార్‌, బహదూర్‌ పురా, యాకత్‌పురా, చాంద్రాయణగుట్ట, కోఠి, అబిడ్స్‌, నాంపల్లి, లక్డీకాపూల్‌, బషీర్‌బాగ్‌, హిమాయత్‌నగర్‌, హుస్సేన్‌సాగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం వేళ కావడంతో ఇంటికి వెళ్లే ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం బయటికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్‌ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, బంజారాహిల్స్, అమీర్ పేట్ , పాతబస్తీ, చార్మినార్‌, బహదూర్‌ పురా, యాకత్‌పురా, చాంద్రాయణగుట్ట, కోఠి, అబిడ్స్‌, నాంపల్లి, లక్డీకాపూల్‌, బషీర్‌బాగ్‌, హిమాయత్‌నగర్‌, హుస్సేన్‌సాగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం వేళ కావడంతో ఇంటికి వెళ్లే ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం బయటికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. పలు కాలనీల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. అటు నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్లకు వర్షం ఇబ్బంది కల్గించింది. మరో వైపు తెలంగాణలో మూడు రోజులు చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 3 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Sep 29, 2023 06:36 PM