Rain Alert: బాబోయ్ మళ్లీనా.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.!

Updated on: Dec 10, 2024 | 5:49 PM

దక్షిణాదిన దడ పుట్టించిన ఫెయింజల్‌ తుపాన్‌ తీరం దాటడంతో అంతా హమ్మయ్య అనుకున్నారు. ఫెయింజల్‌ తుఫాను బలహీనపడి అల్పపడీనంగా మారి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. దీంతో ఇప్పట్లో వానలు మళ్లీ రావులే అని జనాలు సంబరపడ్డారు. కానీ ఇంతలో వాతావరణ శాఖ మరో సంచలన వార్త అందించింది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది.

తుపాన్‌ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. డిసెంబర్‌ 6,7 తేదీల్లో ఏర్పడే ఆవర్తనం దక్షిణ దిశగా పయనించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. అది డిసెంబర్‌ 7 నాటికి అల్పపీడనంగా మారనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అది వాయువ్య దిశగా పయనించి డిసెంబర్ 12 నాటికి తమిళనాడు-శ్రీలంక తీర రేఖకు చేరుకుంటుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో తమిళనాడులోని దక్షిణ కోస్తా జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.

చెన్నైలోని కొన్ని ప్రాంతాలు, దాని శివారు ప్రాంతాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 12, 13 తేదీల్లో తమిళనాడులోని దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు. కాగా ఇప్పటికే ఫెయింజల్‌ తుఫాను ప్రభావంతో ఏపీలోని నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాలు, ఇటు తమిళనాడు కోలుకోక ముందే తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అనువైన పరిస్థితులు నెలకొనడంతో రైతులు ఆందోళ చెందుతున్నారు. ఏపీలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us