సమతామూర్తి వద్ద ‘ఈక్వాలిటీ రన్’.. చిన్న జీయర్ స్వామి గ్రాండ్ రన్!

Updated on: Nov 02, 2026 | 3:26 PM

కుల, వర్గ భేదాలు లేని సమాజమే లక్ష్యంగా సమతామూర్తి ప్రాంగణంలో ఈక్వాలిటీ రన్‌ మారథాన్‌ నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి స్వయంగా 5కే రన్‌లో పాల్గొని ఉత్సాహపరిచారు. రామానుజాచార్యుల సమానత్వ సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకే 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 21కే, 10కే, 5కే, 3కే విభాగాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

సమాజంలో కుల, వర్గ అసమానతలను తొలగించి, అందరిలో సమతా భావాన్ని నింపేందుకు వెయ్యేళ్ల క్రితమే శ్రీ రామానుజాచార్య స్వామివారు విశేష కృషి చేశారని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఉద్ఘాటించారు. అట్టడుగు వర్గాల వారికి సైతం దేవాలయ ప్రవేశం కల్పించి, ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, గౌరవం ఉండాలని రామానుజులు ఆనాడే చాటిచెప్పారని గుర్తుచేశారు. ఈ సమానత్వ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా పంపేందుకే 216 అడుగుల అత్యంత ఎత్తైన ‘సమతామూర్తి’ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 180 దివ్యదేశాల నడుమ రూపుదిద్దుకున్న ఈ ప్రాంగణం కుల, మత, వర్గ భేదాలు లేని సమాజాన్ని ఆకాంక్షిస్తోందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సామాజిక సేవా లక్ష్యంతో, సమానత్వ భావనను చాటిచెప్పేందుకు సమతామూర్తి ప్రాంగణంలో “ఈక్వాలిటీ రన్” మారథాన్ వైభవంగా నిర్వహించారు. 21 కే, 10 కే, 5 కే, 3 కే విభాగాల్లో జరిగిన ఈ మారథాన్‌లో శ్రీ చిన్నజీయర్ స్వామి స్వయంగా 5 కే రన్‌లో పాల్గొని అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఏమన్నారంటే… మొదటిసారి సమతామూర్తి ప్రాంగణానికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రపంచానికి సమానత్వాన్ని చాటే ఈ దివ్య క్షేత్రంలో మారథాన్ నిర్వహించడం, అందులో తాను భాగస్వామి కావడం సంతోషకరమని పేర్కొన్నారు. సమాజంలో మంచి మార్పు తెచ్చే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, భక్తులు పాల్గొని మారథాన్‌ను విజయవంతం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

WhatsApp: వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!

సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు

పక్షవాతం అన్నాడు… ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!

చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..

Loading...
Unable to load recommendations.
Follow Us