Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.! ఎక్కడున్నావ్ బాస్.?

|

Oct 07, 2024 | 11:59 AM

యూట్యూబర్ హర్షసాయి కేసు మరో మలుపు తిరిగింది. అతడిపై నార్సింగ్ పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. హర్షసాయిపై గత నెలలో అత్యాచారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనపై అత్యాచారం చేశాడని, నగ్న వీడియోలు, ఫొటోలు చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడంటూ ఓ సినీ నటి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక మరోవైపు తనపై అత్యాచారం కేసు నమోదైన దగ్గర నుంచి చిక్కడు దొరకడు..

యూట్యూబర్ హర్షసాయి కేసు మరో మలుపు తిరిగింది. అతడిపై నార్సింగ్ పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. హర్షసాయిపై గత నెలలో అత్యాచారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనపై అత్యాచారం చేశాడని, నగ్న వీడియోలు, ఫొటోలు చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడంటూ ఓ సినీ నటి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక మరోవైపు తనపై అత్యాచారం కేసు నమోదైన దగ్గర నుంచి చిక్కడు దొరకడు తరహాలో యూట్యూబర్‌ హర్షసాయి పోలీసులతో దాగుడు మూతలు ఆడుతున్నాడు. అత్యాచారం కేసు నమోదు తరువాత అజ్ఞాతంలోకి వెళ్లాడు.అతని జాడ కోసం నార్సింగి పోలీసులు స్పెషల్‌ టీమ్స్‌ను రంగంలోకి దించారు. హర్షసాయి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని బాధితురాలు పోలీసులకు మరో ఫిర్యాదు చేసింది. ఇక హర్షసాయి బాధితుల నుంచి కూడా కంప్లయింట్స్ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హర్షసాయి.. హెల్పింగ్‌ టీమ్‌ పేరిట తనను మోసం చేశాడంటూ ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.

అటు హర్ష సాయి కేసులో బాధితురాలు తాజాగా మరో ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తన ఫోటోలు పెట్టి ట్రోల్ చేస్తున్నారంటూ కంప్లయింట్ ఇచ్చింది. తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Oct 06, 2024 03:33 PM