Yash: కటింగ్ చేసిన ‘సింహం’ మాదిరి.. KGF హీరో లుక్‌పై కామెడీ సెటైర్లు

Updated on: Feb 25, 2026 | 12:44 PM

కేజీఎఫ్ హీరో యష్ తన ఐకానిక్ లుక్‌ను మార్చారు. 9 ఏళ్లుగా మెయింటైన్ చేసిన గడ్డం, జుట్టును వదిలేసి, ట్యాక్సిక్ సినిమా కోసం క్లీన్ షేవ్‌లో, సరికొత్త హెయిర్‌స్టైల్‌తో కనిపించారు. ఈ మార్పు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. కొందరు ఫన్నీ కామెంట్లు చేస్తుంటే, మరికొందరు ట్యాక్సిక్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. యష్ తాజా లుక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

కలలో కూడా హీరో యశ్‌.., గుబురు గడ్డంతో.. ఒత్తైన జుట్టుతోనే కనిపిస్తాడు. కేజీఎఫ్ సినిమాను గుర్తుకు తెస్తాడు. మనందరికీ కేజీఎఫ్ లుక్‌లోనే అలవాటైన ఈ హీరో ఇప్పుడు తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. గడ్డం తీసేసి క్లీన్‌ షేవ్‌తో.. చిన్న మీస కట్టుతో.. చిన్న హెయిర్‌స్టైల్‌తో కంప్లీట్‌ న్యూ లుక్‌లోకి ట్రాన్స్‌ఫాం అయ్యాడు. తన లేటెస్ట్‌ లుక్‌కు సంబంధించిన వీడియోతో.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే.. కామెడీ కామెంట్స్‌ వచ్చేలా చేసుకుంటున్నాడు హీరో యశ్‌. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి… కేజీఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవల్లో దిమ్మతిరిగేలా చేసిన యశ్‌..ఆ సినిమా లేక్‌తోనే ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూ వస్తున్నాడు. కేజీఎఫ్‌ తర్వాత దానికి సీక్వెల్‌ చేయడం.. అదే లుక్ మెయిన్‌టేన్ చేసిన ఈ హీరో … తన అప్‌కమింగ్ మూవీ.. టాక్సిక్ కోసం.. డిఫరెంట్ గెటప్‌లో సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నాడు. ఇందుకోసం హీరో యశ్‌.. 9ఏళ్లుగా మెయిన్‌టేన్ చేస్తూ వస్తున్న తన గుబురు గడ్డానికి గుబ్ డై చెప్పాడు. క్లీన్ షేవ్ చేసుకుంటూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అయితే గుబురు గడ్డంతో.. గంభీరంగా కనిపించే యశ్‌ను.. గడ్డం లేకుండా చూసిన అందరూ షాకవుతున్నారు. ఇలా ఉన్నాడేంటి అంటూ ఫన్నీ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కానీ యశ్‌ ఫ్యాన్స్ మాత్రం.. తమ అభిమాన హీరో లుక్స్‌ను విపరీతంగా వైరల్ చేస్తూ.. మార్చ్‌ 19కి రిలీజ్ అయ్యే టాక్సిక్ సినిమా కోసం.. ఈగర్లీ వెయిటింగ్ అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘కొడవ’ పద్దతిలో విజయ్, రష్మిక వివాహం.. ఈ పెళ్లి ప్రత్యేకలు ఏంటంటే ??

Babu Mohan: నేను తినే పాన్‏లో విషం పెట్టి చంపాలనుకున్నారు..

Follow Us