Toxic: టాక్సిక్‌ నుంచి మరో అప్‌డేట్‌.. ఏం చెప్పాలనుకుంటున్నారు?

Edited By:

Updated on: Jul 10, 2026 | 7:29 PM

కేజీఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన యష్-కియారా రొమాంటిక్ వీడియో సాంగ్ చర్చనీయాంశంగా మారింది. డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యష్ డాన్ పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు రామాయణంలో రావణుడిగా నటిస్తూ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలపై తన ఆసక్తిని కొనసాగిస్తున్నారు.

కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న మూవీ టాక్సిక్‌. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఒక్కో అప్‌డేట్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. టాక్సిక్‌ అప్‌డేట్స్‌ విషయంలోనే కాదు… తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలోనూ పక్కా స్ట్రాటజీతో డెసిషన్స్ తీసుకుంటున్నారు. టాక్సిక్ సినిమా నుంచి మరో అప్‌డేనట్ వచ్చింది. యష్, కియారాల మీద రూపొందించిన రొమాంటిక్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. గ్లోబల్‌ ప్రాజెక్ట్‌గా సిద్ధం చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ విషయంలోనూ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. అందుకే సౌత్‌ స్టైల్‌లో లిరికల్‌ సాంగ్ రిలీజ్ చేయకుండా.. వీడియో సాంగ్‌ను వదిలారు మేకర్స్. ఈ సినిమా విషయంలో టీజర్‌ నుంచే కంటెంట్ విషయంలో కంప్లయింట్స్‌ ఉన్నాయి. ముఖ్యంగా ఎరొటిక్ సీన్స్‌ కాస్త ఎక్కువగా ఉన్నాయన్నది మేజర్‌గా వినిపిస్తున్న మాట. ఫస్ట్ సింగిల్ విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు మేకర్స్. రొమాంటిక్‌ అన్న బార్డర్‌ను క్రాస్ చేసి ఎరొటిక్‌ అన్న రేంజ్‌లోనే ఈ డ్యూయట్‌ను కంపోజ్ చేశారు. కేజీఎఫ్ సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన యష్, టాక్సిక్‌లోనూ అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. డ్రగ్‌ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో యష్ డాన్‌ పాత్రలో కనిపించబోతున్నారు. పాటిటివ్ రోల్స్‌ కన్నా… నెగెటివ్ రోల్స్ మీదే ఎక్కువగా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న రామాయణలో పూర్తిస్థాయి విలన్‌గా కనిపించబోతున్నారు. మైథలాజికల్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో యష్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇలా డిఫరెంట్ మూవీ సెలక్షన్‌తో ఫ్యా్న్స్‌లో అంచనాలు పెంచేస్తున్నారు రాకింగ్ స్టార్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr.NTR: ‘డ్రాగన్’ కోసం తారక్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా

వయసు పెరిగినా వేగం తగ్గలేదు.. టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న నలుగురు సీనియర్ స్టార్‌ల బిజీ షెడ్యూల్

ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!

మైనర్ ను పెళ్లి చేసుకుని జైలుపాలయ్యాడు.. అక్కడి నుంచి తప్పించుకుని చివరికి ఇలా..

సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా

Follow Us