‘వారణాసి’ తర్వాత జక్కన్న ప్లాన్ ఏంటి?… నెక్ట్స్ హీరోపై మొదలైన భారీ చర్చ..!
మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న 'వారణాసి' చిత్రంలో బిజీగా ఉన్న రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తికర చర్చ సాగుతోంది. స్టార్ దర్శకులంతా వరుసగా కొత్త సినిమాలను ప్రకటిస్తుండటంతో జక్కన్న కూడా అదే బాటలో నడుస్తారా అనే ప్రశ్న నెలకొంది. 'బాహుబలి 3', మరో మల్టీస్టారర్ లేదా ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్‌లలో ఎవరితోనైనా రిపీట్ కాంబినేషన్ ఉంటుందా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
ప్రజెంట్ స్టార్ హీరోలంతా స్పీడు పెంచుతున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఈ స్పీడును మ్యాచ్ చేసేందుకు దర్శకులు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఓ సినిమా షూటింగ్‌లో ఉండగానే ఆ తరువాత చేయబోయే సినిమా వర్క్ మొదలు పెట్టేస్తున్నారు. మరి ఈ లిస్ట్‌లో రాజమౌళి కూడా జాయిన్ అవుతారా..? అలా అయితే జక్కన్న నెక్ట్స్ మూవీ ఏ కాంబినేషన్‌లో ఉంటుంది..? ప్రజెంట్ వారణాసి వర్క్‌లో బిజీగా ఉన్నారు దర్శక ధీరుడు రాజమౌళి. మహేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాని గ్లోబల్ రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు కష్టపడుతున్నారు. సాధరణంగా రాజమౌళి ఒక సినిమా షూటింగ్‌లో ఉండగా ఆయన నెక్ట్స్ మూవీ ఏంటన్న డిస్కషన్ ఎప్పుడూ ఉండదు. సినిమా రిలీజ్ అయిన తరువాతే నెక్ట్స్ ప్రాజెక్ట్ వర్క్ షురూ చేయటం రాజమౌళి స్టైల్. కానీ ప్రజెంట్ టాప్ డైరెక్టర్స్ అంతా స్పీడు పెంచారు. ఒక సినిమా లైన్‌లో ఉండగానే మరో మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చేస్తున్నారు. అందుకే రాజమౌళి కాంపౌండ్ నుంచి కూడా అలాంటి ఎనౌన్స్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాదు జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏ కాంబినేషన్‌లో ఉండొచ్చు అన్న విషయంలోనూ డిస్కషన్ గట్టిగానే జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కువగా రిపీట్ కాంబినేషన్ మీదే ఇంట్రస్ట్ చూపించారు రాజమౌళి. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్స్‌తో రిపీటెడ్‌గా వర్క్ చేశారు. అందుకే ఆ హీరోల్లో ఒకరితోనే నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. రీసెంట్‌గా బాహుబలి 3 గురించి కూడా చర్చ జరగటంతో నెక్ట్స్ త్రీక్వెల్ మీద దృష్టి పెట్టే ఛాన్స్ లేకపోలేదన్న న్యూస్ ట్రెండ్ అవుతోంది. ట్రిపులార్‌తో మల్టీస్టారర్ ట్రెండ్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లిన జక్కన్న, వారణాసిలో మహేష్, పృథ్వీరాజ్‌ను లీడ్ రోల్స్‌లో చూపిస్తున్నారు. అందుకే జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ మల్టీ స్టారర్‌గానే ఉండే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అంతేకాదు ఆ కాంబినేషన్‌కు సంబంధించిన ఈక్వేషన్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో జక్కన్న ప్లానింగ్ ఎలా ఉందో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అప్‌డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jana Nayagan: ఆర్నెల్ల నిరీక్షణకు ముగింపు… ‘జన నాయగన్’ రాకతో బాక్సాఫీస్‌లో కొత్త సమరం..!
Naga Chaitanya: ‘వృషకర్మ’తో చైతూ కొత్త రికార్డు.. విడుదలకే ముందే బిజినెస్ బ్లాస్ట్..!
Paradise: ‘ది ప్యారడైజ్’పై రూ.110 కోట్ల రూమర్స్… మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ఇదే..!
Akhil Akkineni: ‘లెనిన్’తో మారిన అఖిల్… ఇప్పుడు మొదలైంది అసలైన 2.0 జర్నీ..!
ఒక్క సినిమాలో ఐదుగురు హీరోయిన్లు… గ్లోబల్ మూవీస్ కొత్త ఫార్ములా..!
