ఇద్దరూ ఒకే లైన్లో.. పూనకాలు గ్యారెంటీ..

Updated on: May 26, 2025 | 4:11 PM

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పటివరకూ పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. అయినా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ పాన్ ఇండియా సినిమాలతో రానున్నారు.

మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ లాంటి సంచలన విజయం తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ గ్లోబల్ గా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు రాజమోళి. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పవన్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా చేస్తున్నారు పవన్. ఈ సినిమా షూటింగ్ కూడా సైలెంట్ గా జరుగుతుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తమ అభిమానులకు పూనకాలు తెప్పించే సన్నివేశాల్లో నటిస్తున్నారని తెలుస్తుంది. అదేంటంటే రాజమౌళి సినిమాలో మహేష్ బాబు షర్ట్ లెస్ ఫైట్ ఉండనుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.ఈ ఫైట్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఓజీ సినిమాలో షర్ట్ లెస్ ఫైట్ చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓజీ సినిమాలో సుజిత్ ఓ అదిరిపోయే ఫైట్ సీన్ ను ప్లాన్ చేశాడట. ఈ ఫైట్ లో పవన్ షర్ట్ లేకుండా కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది తెలియదు కానీ.. ఇదే నిజమైతే మహేష్, పవన్ అభిమానులు థియేటర్స్ లో పూనకాలతో ఊగిపోతారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏడుపుగొట్టు సినిమా అంటూ కామెంట్.. దెబ్బకు హీరో వైరల్

చడీచప్పుడు కాకుండా… విధ్వంసాన్ని మొదలెట్టిన చిరు

‘వెళ్లి నాన్న కాళ్లపై పడాలని ఉంది’ మంచు మనోజ్‌ ఎమోషనల్

ఉన్నట్టుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. నాని బిగ్ సర్‌ప్రైజ్‌

నేనూ అమ్మాయినే.. నాకూ పీరియడ్స్ వస్తాయి.. మరీ ఇంత బోల్డా