టాలీవుడ్‌కే ఫిక్స్ అయిన సూర్య – దుల్కర్‌.. ఎందుకలా

Updated on: Feb 10, 2026 | 4:26 PM

సూర్య, దుల్కర్ సల్మాన్‌లు టాలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య విశ్వనాథం అండ్ సన్స్ చేస్తున్నారు. పరశురాం దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దుల్కర్ మలయాళంలో సినిమాలు తగ్గించి, ఆకాశంలో ఒక తార వంటి తెలుగు చిత్రాలపై దృష్టి పెట్టారు. టాలీవుడ్‌లో వారి ప్రాజెక్టులు చర్చనీయాంశంగా మారాయి.

టాలీవుడ్ పరిశ్రమపై దృష్టి సారించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని మొదట నమ్మిన పొరుగు హీరోలలో సూర్య ముందున్నారు. ఆయన్ని దుల్కర్ సల్మాన్ అనుసరించారు. దుల్కర్ ఇప్పటికే తెలుగు సినిమాల వేగాన్ని పెంచగా, ఇప్పుడు సూర్య కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం సూర్య, సెన్సిబుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో విశ్వనాథం అండ్ సన్స్ అనే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎమోషనల్ డ్రామా చేస్తున్నారు. ఇందులో సూర్య పాత్రను వెంకీ అట్లూరి ప్రత్యేకంగా డిజైన్ చేశారని తెలుస్తోంది. ఇటీవలే రెట్రో చిత్రంతో ఆకట్టుకున్న సూర్య, తెలుగు దర్శకుడితో చేసే సినిమాపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అలాగే, కమర్షియల్ ఫ్యామిలీ కంటెంట్‌ను రూపొందించడంలో పేరున్న పరశురాం దర్శకత్వంలో మరో సినిమాకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కాంబో మంచి సినిమాకు గ్యారెంటీ అనే బజ్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. సూర్య నటించిన కరుప్పు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రజనీ – కమల్‌ మూవీ.. స్టోరీ లీక్‌ !! కథ మామూలుగా లేదుగా

మెగాస్టార్‌ నయా సెంటిమెంట్‌ రివీల్‌.. ఇక దుమ్ము దుమారమే

Venkatesh: హ్యాట్రిక్‌ ట్రయల్స్.. విక్టరీ హీరోకి వర్కవుట్‌ అవుతుందా

ప్యాన్‌ ఇండియా అంటే హింసేనా !! విజయానికి అదే మార్గమా

నమ్మకానికి అమ్మ వంటిది టాలీవుడ్.. అంటున్న నార్త్ భామలు

Published on: Feb 10, 2026 04:25 PM
Loading...
Unable to load recommendations.
Follow Us