అరుదైన ఫీట్‌ను సొంతం చేసుకున్నా తొలి సౌత్ ఇండియ‌న్ హీరో మ‌న రౌడీ బాయ్‌.. ఇంత‌కీ విష‌య‌మేంటంటే..:Vijay Devarakonda video.
Vijay Devarakonda

అరుదైన ఫీట్‌ను సొంతం చేసుకున్నా తొలి సౌత్ ఇండియ‌న్ హీరో మ‌న రౌడీ బాయ్‌.. ఇంత‌కీ విష‌య‌మేంటంటే..:Vijay Devarakonda video.

Updated on: Jun 16, 2021 | 7:37 AM

లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్ర ద్వారా వెండి తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ సినిమాలో విజ‌య్ ఉన్నాడ‌న్న‌ విష‌యం కూడా చాలా మందికి తెలియ‌దు కానీ నేడు.. విజ‌య్ దేవ‌ర‌కొండ అనే పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.

లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్ర ద్వారా వెండి తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ సినిమాలో విజ‌య్ ఉన్నాడ‌న్న‌ విష‌యం కూడా చాలా మందికి తెలియ‌దు కానీ నేడు.. విజ‌య్ దేవ‌ర‌కొండ అనే పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. అర్జున్ రెడ్డి అనే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా సినీ ల‌వ‌ర్స్‌ను త‌న‌వైపు తిప్పుకున్నాడీ రౌడీ బాయ్‌. ఇక తాజాగా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వంలో లైగ‌ర్ చిత్రంతో బాలీవుడ్‌లో దుమ్మురేప‌డానికి సిద్ధ‌మ‌య్యాడు విజ‌య్‌. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ‌లేని క్రేజ్ సంపాదించుకున్న విజ‌య్ తాజాగా.. ఇండియా సెకండ్‌ మోస్ట్ డిజైర‌బుల్ మ్యాన్ 2020 టైటిల్‌ను గెలుచుకున్న విష‌యం తెలిసిందే. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు మ‌రో అరుదైన ఫీట్‌ను సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీల‌తో ఏటా క్యాలెండ‌ర్ విడుద‌ల చేసే డ‌బూ ర‌త్నాని తాజాగా విజ‌య్‌ని కూడా త‌న కెమెరాలో బంధించాడు. 2020-2021 క్యాలెండ‌ర్‌లో క‌నిపించిన తొలి సౌత్ ఇండియన్ న‌టుడిగా విజ‌య్ పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటో నెట్టింట వైర‌ల్‌గా మారింది. స్టైలిష్ లుక్‌లో బైక్‌పై దిగిన ఫొటోను చూసి ఆయ‌న అభిమానులు ఫిదా అవుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో బాలయ్య బాబు.. ‘రామారావుగారు’ సబ్జెక్ట్‌ ను సిద్ధం చేస్తున్న అనిల్ రావిపూడి : anil ravipudi and balakrishna movie video.

Pooja Hegde Video:హాట్ నెస్‌ ఓవర్‌లోడెడ్ బుట్టబొమ్మా.. మ‌రీ ఇంత అంద‌మైతే ఎట్టాగ‌మ్మా.. !వీడియో.

సలార్‌ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్న డార్లింగ్..వరుస పెద్ద సినిమాలతో బిజీ గా ప్రభాస్ :Salaar Movie Video.

‘మీట్ క్యూట్’ అంటూ సినిమా మొదలు..ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టిన నాని సిస్టర్..:Deepthi ganta as director video.

Published on: Jun 15, 2021 11:33 PM