Shankar: శంకర్ నెక్స్ట్ టార్గెట్ ఆ సినిమానే.. ఈ సారి ఊచకోత తప్పదా

Edited By:

Updated on: Mar 16, 2026 | 9:21 PM

దర్శకుడు శంకర్‌ తన తదుపరి భారీ ప్రాజెక్ట్ 'వేల్పారి'పై దృష్టి సారించారు. గత చిత్రాల పరాజయాల తర్వాత తనను తాను నిరూపించుకోవడానికి ఇది కీలకం. ఈ మాగ్నమ్‌ ఆపస్‌ కోసం ధనుష్, రణ్‌వీర్‌ సింగ్, విక్కీ కౌశల్‌ వంటి స్టార్స్‌ పేర్లు వినిపిస్తున్నాయి. మల్టీస్టారర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

శంకర్‌ పేరు చెబితే ఇప్పుడు ఎవరికీ ఇండియన్‌ త్రీక్వెల్‌ గుర్తుకు రావడం లేదు.. ఆయన చేసిన లాస్ట్ సినిమాలేవీ కళ్ల ముందు కనిపించడం లేదు.. శంకర్‌ పేరు చెప్పగానే అందరి కళ్ల ముందూ మెదులుతున్న విషయం వేల్పారి ప్రాజెక్ట్. మాగ్నమ్‌ ఆపస్‌గా తెరకెక్కించాలనే ఆ ప్రాజెక్టు గురించి ఇప్పుడో ఇంట్రస్టింగ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది. ఇంతకీ ఏంటది? అంతా అనుకున్నట్టు జరిగి ఉంటే, ఈ పాటికే ఇండియన్‌ త్రీక్వెల్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సింది శంకర్‌. కానీ ఇండియన్‌ సీక్వెల్‌ బాక్సాఫీస్‌ దగ్గర ఢమాల్‌ మనడంతో ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు ఎవరూ. శంకర్‌ అండ్ కమల్‌ కలిసి ఆ సినిమాను చేస్తే చేయాలని లైకా చెప్పినట్టు సమాచారం. అంతే కాదు, ఈ సినిమా పూర్తి చేయకుండా శంకర్‌ ఇంకే మూవీకీ వెళ్లకూడదని కూడా కండిషన్‌ పెట్టిందంటోంది కోలీవుడ్‌. ఇండస్ట్రీలో ప్యాన్‌ ఇండియా అనే టాపిక్‌ పాపులర్‌ కాకముందే, తన సినిమాలతో నేషనల్‌ వైడ్‌ క్లిక్‌ అయిన కెప్టెన్‌ శంకర్‌. సోషల్‌ ఎలిమెంట్స్ ని, కమర్షియల్‌ యాంగిల్‌లో, ఫుల్‌ టెక్నాలజీతో ఎంత బాగా చెప్తున్నారో అని ఆయన్ని చూసి ఇన్‌స్పయిర్‌ అయినవాళ్లు కోకొల్లలు. అయితే వరుస ఫ్లాప్‌లు ఆయన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఇప్పుడు ఎలాగైనా తనను తాను ప్రూవ్‌ చేసుకోవాల్సిన పనుల్లో ఉన్నారు. అందుకు, తన ముందున్న ఏకైక మార్గం వేల్పారి అని ఫిక్సయ్యారు. ఆల్రెడీ వేల్పారి పనుల్లో బిజీ అయ్యారు. ఫ్లాప్‌ల ఆలోచనలు అన్నిటినీ పక్కనపెట్టి వేల్పారి కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారట శంకర్‌. అందులో భాగంగానే ధనుష్‌ని కలిశారట. వేల్పారిలో ఓ స్పెషల్‌ రోల్‌ కోసం ధనుష్‌ ని అప్రోచ్‌ అయినట్టు కోలీవుడ్‌ టాక్‌. ఆల్రెడీ వేల్పారి కోసం రణ్‌వీర్‌ సింగ్‌ లైన్లో ఉన్నారన్నది ఎప్పటి నుంచో ఉన్న వార్త. ఇప్పుడు నార్త్ నుంచి రణ్‌ వీర్‌ ప్లేస్‌లో విక్కీ కౌశల్‌ పేరు వినిపిస్తోంది. మరి ఇప్పుడు వేల్పారిలో ఆల్రెడీ అనుకున్న రణ్‌వీర్‌ ఉంటారా? విక్కీ కౌశల్‌ వస్తారా? ధనుష్‌ మెయిన్‌ రోల్‌ చేస్తారా? లేకుంటే మల్టీస్టారర్‌గా ప్లాన్‌ చేస్తున్నారా? ఇలాంటి వన్నీ ఆసక్తికరంగా మారాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika: రష్మిక కాక్‌టైల్‌ పార్టీ డేట్‌ ఫిక్స్ !! పెళ్లి తర్వాత మొట్ట మొదటి సినిమా

Nayanthara: ఆరు జనరేషన్ల హీరోలతో కలిసి వర్క్ చేసిన బ్యూటీ

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌లో మరింత జోష్‌… రికార్డులు బ్రేక్ అవుతాయా ??

వెండితెర మీద కొత్త ప్రపంచాలు… లెక్క సరిపోతుందా ??

Trisha: టాప్‌లో ట్రెండ్ అవుతున్న త్రిష పేరు..

Follow Us