Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో.

|

Jun 19, 2024 | 9:39 AM

చాలా రోజుల తర్వాత మహారజ మూవీ సక్సెస్‌తో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. నితిలన్ సామినాథన్ డైరెక్షన్లో తెరకెక్కి ఈ సినిమా ఇప్పుడు మంచి టాక్ తెచ్చుకుని.. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. కోలీవుడ్ లో మాత్రమే కాదు.. టాలీవుడ్‌లో కూడా.. ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో మహారాజా చిత్ర బృందం సంతోషంలో మునిగి తేలుతోంది.

చాలా రోజుల తర్వాత మహారజ మూవీ సక్సెస్‌తో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. నితిలన్ సామినాథన్ డైరెక్షన్లో తెరకెక్కి ఈ సినిమా ఇప్పుడు మంచి టాక్ తెచ్చుకుని… బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. కోలీవుడ్ లో మాత్రమే కాదు.. టాలీవుడ్‌లో కూడా.. ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో మహారాజా చిత్ర బృందం సంతోషంలో మునిగి తేలుతోంది. సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ తమ సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఓ ఈవెంట్‌ కోసం హైద్రాబాద్‌కు వచ్చిన సేతుపతి కాళ్లను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు పరుగెత్తికెళ్లి మొక్కడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.

బుచ్చి బాబు డైరెక్షన్లో ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. ఉప్పెన సినిమాలో కేవలం బుచ్చిబాబు స్టోరీ నరేషన్‌ను.. తనలోని ఎగ్జైట్ మెంట్‌ను చూసే విలన్‌గా చేసేనని రీసెంట్‌గా మహారాజా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కూడా చాలా సార్లు చెప్పారు సేతుపతి. ఇక ఈక్రమంలోనే మరో సారి ఓ కార్యక్రమం కోసం హైద్రాబాద్‌కు వచ్చిన విజయ్‌ సేతుపతిని బుచ్చిబాబు కలిశారు. విజయ్‌ ను చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి తన కాళ్లకు నమర్కించాడు. విజయ్‌ కూడా ఆప్యాయంగా… బుచ్చిబాబును చిన్నా అంటూ.. ఆలింగనం చేసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.