బరిలో భారీ చిత్రాలు.. అయినా ఏంటీ కన్‌ఫ్యూజన్‌..?

Updated on: Jul 08, 2026 | 11:39 AM

2026 ప్రథమార్థం నిరాశపరిచినా, ద్వితీయార్థం భారీ సినిమాల లైనప్‌తో ఆడియన్స్‌లో ఆశలు పెంచేసింది. అయితే, ఈ అంచనాలకు తగ్గట్లుగా సినిమాలు ఎప్పుడు వస్తాయనే దానిపై స్పష్టత లేకపోవడం అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. అనేక మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ల రిలీజ్ డేట్స్ విషయంలో కొనసాగుతున్న కన్‌ఫ్యూజన్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర ఈ ఏడాదే వస్తుందని మేకర్స్ దృఢంగా ఉన్నారు. దసరా బరిలో ఉండొచ్చని టాక్ ఉన్నా, అధికారిక ధృవీకరణ లేదు. ప్రభాస్ ఫౌజీ కూడా మొదట దసరా అనుకున్నా, షూటింగ్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్‌కు వాయిదా పడింది. ఆ తేదీ కూడా అనుమానాస్పదంగానే ఉంది. నాని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ది ప్యారడైజ్ మార్చిలోనే రావాల్సింది. షూటింగ్ ఆలస్యం కావడంతో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ అంటూ రకరకాల తేదీలు ప్రచారంలో ఉన్నాయి. బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ, అలాగే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న రామాయణ పార్ట్ వన్ కూడా దీపావళికి వస్తుందని టీమ్ ప్రకటించినప్పటికీ, కచ్చితమైన తేదీ మాత్రం చెప్పడం లేదు. ఈ అనిశ్చితి అభిమానులను నిరాశపరుస్తోంది.

Follow Us