TOP9 ET: ఒక్క సినిమా.. రూ.120 కోట్ల రెమ్యునరేషన్ వా.. చరణ్! | ముద్దుల హీరోగా డార్లింగ్.
కోలీవుడ్లో స్టారాధి స్టారుడు.. గ్రేటాది గ్రేటాది గ్రేటుడు ఎవరంటే.. రజినీ అంటున్నారు అంతా! దాదాపు 73ఏళ్ల వయసులోనూ.. మాస్‌కి మరణం చూపిస్తున్న ఈ సూపర్ స్టార్... ఇప్పుడు రెమ్యునరేషన్‌లో మరో రికార్డును క్రియేట్ చేశారు కనుక! లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో.. తాను చేస్తున్న కూలీ సినిమా కోసం.. రజినీ ఏకంగా 260 కోట్ల నుంచి 270 కోట్ల వరకు తీసుకుంటున్నారట. ఒక వేళ ఇదే నిజమైతే ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా తలైవా రికార్డులకెక్కడం ఖాయం.
01.ram charan: ఒక్క సినిమా.. 120 కోట్ల రెమ్యూనరేషన్ వా.. చరణ్!
సినిమాల కలెక్షన్స్‌లోనే కాదు.. రెమ్యూనరేషన్‌లోనూ వండర్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన క్రేజ్‌తో ఇప్పుడేకంగా 120 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తన లేటెస్ట్.. ది మోస్ట్ అవేటెడ్ అప్‌కమింగ్ మూవీ గేమ్ ఛేంజర్ సినిమాకు కూడా..ద ఆదాపు 120 కోట్లను రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారట… ఈ గ్లోబల్ హీరో.
02.Rajini: పిల్ల బచ్చాగాళ్లకు దిమ్మతిరిగే న్యూస్! అక్కడుంది తళైవా రా!
కోలీవుడ్లో స్టారాధి స్టారుడు.. గ్రేటాది గ్రేటాది గ్రేటుడు ఎవరంటే.. రజినీ అంటున్నారు అంతా! దాదాపు 73ఏళ్ల వయసులోనూ.. మాస్‌కి మరణం చూపిస్తున్న ఈ సూపర్ స్టార్… ఇప్పుడు రెమ్యునరేషన్‌లో మరో రికార్డును క్రియేట్ చేశారు కనుక! లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో.. తాను చేస్తున్న కూలీ సినిమా కోసం.. రజినీ ఏకంగా 260 కోట్ల నుంచి 270 కోట్ల వరకు తీసుకుంటున్నారట. ఒక వేళ ఇదే నిజమైతే ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా తలైవా రికార్డులకెక్కడం ఖాయం. రజినీ ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా.. పిల్లబచ్చాగాళ్లకు దిమ్మతిరిగి పోతోందనే కామెంట్ నెట్టింట రావడం కూడా ఖాయం.
03.prabhas: అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
చిన్నదో వైపు.. పెద్దదో వైపు అన్నట్టుగా స్టార్ హీరోలు ఇప్పటికే చాలా సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ మాత్రం.. కాస్త సెపరేట్‌గా.. చిన్న దానితో.. పెద్ద దానితో .. చెరో సినిమా చేస్తున్నారు. ఎస్! అకార్డింగ్ టూ లెటెస్ట్ రిపోర్ట్.. హను రాఘవ పూడి డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న సినిమాలో చిన్నది జాన్వీని హీరోయిగా తీసుకున్నారట. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కే సలార్ 2లో.. పెద్దది కియారాను హీరోయిన్‌గా అనుకుంటున్నారట. దీంతో ప్రభాస్ ఈ ఇద్దరి బ్యూటీల ముద్దు డార్లింగ్‌గా నెట్టింట వైరల్ అవుతున్నారు.
04.thamanna: IPL మ్యాచ్‌ల కారణంగా.. పోలీస్ కేసులో తమన్నా..
ఓ పక్క IPL మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్న వేళ.. ఈ మ్యాచ్‌ల కారణంగానే తమన్నా చిక్కుల్లో పడ్డారు. కోర్టు నోటీసులు అందుకున్నారు. ఓ పక్క సినిమాల్లో బిజీగా ఉన్న తమన్నా ఫెయిర్ ప్లే యాప్‌కు అంబాసిడర్ గా ఉన్నారు. అయితే ఈ యాప్ గత ఐపీఎల్ అంటే 2023 ఐపీఎల్ మ్యాచ్‌లను తన ప్లాట్ ఫాంలో స్ట్రీమ్ చేసింది. దీంతో ఐపీల్ స్ట్రీమింగ్ రైట్స్ ఉన్న వయాకామ్.. ఈ యాప్‌పై మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమన్నా ఈ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్ కావడంతో.. మహారాస్ట్ర సైబర్ పోలీసులు తమన్నా పేరును తన కంప్లైంట్‌లో మెన్షన్ చేసి.. ఈ బ్యూటీకి నోటీసులిచ్చింది. అయితే ఒక్క తమన్నాకే కాదు.. మరో బ్రాండ్ అంబాసిడర్ సంజయ్ దత్‌కు కూడా నోటీసులు జారీ చేసింది మహారాష్ట్ర సైబర్ సెల్.
05.pushpa villan: నన్ను లైట్ తీసుకోండి – పుష్ప విలన్
చూడ్డానికి కాస్త లీన్‌గా.. కామ్‌గా ఉండే ఫహాద్ ఫాజిల్.. సిల్వర్ స్క్రీన్‌పై మాత్రం తన పర్ఫార్మెన్స్‌తో దిమ్మతిరిగేలా చేస్తాడు. బయట కూడా కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడి అందర్నీ షాక్ అయ్యేలా చేస్తాడు. ఇక తాజాగా కూడా అలాంటి కామెంట్సే చేశాడు ఫాజిల్. సినిమా చూస్తున్నంత సేపు ఎంటర్‌టైన్ అవ్వాలని.. అంతే కానీ.. సినిమా అయిపోయాక తనేం చేస్తున్నానో ఎవరికీ అవసం లేదన్నాడు. థియేటర్ లోపల ఉన్నప్పుడు మాత్రమే ఆలోచించాలని.. అక్కడి నుంచి బయటకు వచ్చేశాక తన గురించి అస్సలు సీరియస్‌గా తీసుకోకూడదని తన ఫ్యాన్స్‌కు చెప్పాడు.
06.sruthi hasan Breakup: ప్రియుడిని పక్కకు పెట్టిన శృతి
ఇన్స్టాలో ఓ హీరోయిన్ క్రేజీగా ఓ వ్యక్తిని ఫాలో అవుతుందంటే.. అతడితో ఫ్రెండ్ షిప్ మొదలెట్టిందని అర్థం.. కలిసి ఫోటోలు పెట్టి. లవ్ ఎమోజీలతో ఆ ఫోటో కింది టెక్ట్స్ ను డెకరేట్ చేసిందంటే.. లవ్‌లో ఉందని అర్థం. రెస్టారెంట్లలో.. పార్టీల్లో కాన్ని క్లోజ్గా ఉన్న ఫోటోలు పెడితే డేటింగ్లో ఉన్నట్టు అర్థం. అదే అన్ ఫాలో కొట్టి.. తన లవర్తో కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేస్తే.. మోహమాటం లేకుండా బ్రేకప్ చెప్పిందని అర్థం. హీరోయిన్ శృతి హాసన్ కూడా ఇప్పుడితే చేసిందంటే.. ఆమె తన ప్రియుడికి బ్రేకప్ చెప్పి పక్కన పెట్టిందనే గా అర్థం. !
07.ram: కోట్ల రెమ్యునరేషన్ వదులుకున్న స్టార్ హీరో…
బోయపాటి డైరెక్షన్లో స్కంద సినిమాతో బాక్సాఫీస్ బొమ్మను తారుమారు చేసిన రామ్ పోతినేని ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ గా వస్తున్నాడు. ఈ సినిమా కోసం సూపర్ ఫైన్గా కష్టపడుతున్నాడు. అంతేకాదు పూరీ మాట కాదనకుండా ఈ మూవీ కోసం ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా పని చేస్తున్నాడ రామ్. మరి అలా అయితే ఎలాగంటారా? రెమ్యునరేషన్ లేకున్నా లాభాల్లో వాటా తీసుకుంటున్నాడట గా..!
08.ameer : ఇక ముచ్చటగా 3వ పెళ్లి..
తలపై ఎన్ని సుడిలుంటే అంత మంది పెళ్లాలొస్తారంటారు పెద్దలు. మరి స్టార్ హీరో అమీర్‌కు మూడు సుడిలు ఉన్నాయి కావచ్చు. అందకే ముచ్చటగా మూడో పెళ్లాం అతి తొందర్లో వస్తుందనే టాక్ బీ టౌన్‌లో వినిస్తోంది. ఇక అకార్డింగ్ టూ ఆ టాక్. అమీర్ తొండర్లో మూడో పెళ్లి చేసుకోబోతున్నారట. అందుకే కిపల్ శర్మ షోలో కూడా.. కపిల్ ఇదే విషయంపై అమీర్ నుంచి ఆన్సర్ రాబట్టే ప్రయత్నం కూడా చేశాడు. కానీ పెద్దగా నవ్వి.. ఆన్సర్‌ను స్కిప్ చేశారు ఈ స్టార్ హీరో. ఇదంతా కపిల్ శర్మ లేటెస్ట్ ప్రోమోలో మీరు క్లియర్‌గా చూడొచ్చు !
09. dill raju: ఏపీ ఎలక్షన్స్ పై దిల్ రాజు కామెంట్
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్‌గా… వన్ ఆఫ్ ది పెద్ద మనిషిగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న దిల్ రాజు.. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ గురించి ఓ వీడియోలో మాట్లాడారు. వైసీపీ ఒంగోలు ఎమ్యెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఆ వీడియోలో మాట్లాడారు. అయితే పొలిటిల్ ఫీల్డ్‌లో అడుగుపెడుతున్నారంటూ.. గత కొంత కాలంగా దిల్ రాజుపై వార్తలు వస్తున్న వేళ.. ఇలా ఓ వీడియోలో ఈ స్టార్ ప్రొడ్యూసర్ మాట్లాడడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!