TOP9 ET: మావోడి లుక్స్‌ చూసి ఇప్పుడు మాట్లాడండ్రా.. | రేణుకా స్వామి కేసులో సంచలన విషయాలు.

|

Jun 21, 2024 | 8:48 AM

ఆదిపురుష్ టైంలో ప్రభాస్‌ లుక్స్‌పై నార్త్‌ జనాలు విపరతమైన ట్రోల్స్‌ చేశారు. ప్రభాస్‌ లుక్స్‌ బాలేవని.. నెగెటివ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్‌ ఫేస్ను పావ్ బాజీతో పోలుస్తూ.. దారుణంగా మీమ్స్ చేసి నెట్టింట వైరల్ కూడా చేశారు. అయితే అప్పుడు అలా తమ ఫెవరెట్ హీరోపై ట్రోల్స్, మీమ్స్‌ అండ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ జనాలను డార్లింగ్ డైహార్డ్‌ ఫ్యాన్స్ ఇప్పుడు టార్గెట్ చేశారు. ముంబయ్‌లో జరిగిన కల్కి ఈవెంట్లో ప్రభాస్ డాషింగ్ లుక్స్‌ను చూపిస్తూ..

01.prabhas: మావోడి లుక్స్‌ చూసి మాట్లాడండ్రా బచ్చాస్‌..

ఆదిపురుష్ టైంలో ప్రభాస్‌ లుక్స్‌పై నార్త్‌ జనాలు విపరతమైన ట్రోల్స్‌ చేశారు. ప్రభాస్‌ లుక్స్‌ బాలేవని.. నెగెటివ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్‌ ఫేస్ను పావ్ బాజీతో పోలుస్తూ.. దారుణంగా మీమ్స్ చేసి నెట్టింట వైరల్ కూడా చేశారు. అయితే అప్పుడు అలా తమ ఫెవరెట్ హీరోపై ట్రోల్స్, మీమ్స్‌ అండ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ జనాలను డార్లింగ్ డైహార్డ్‌ ఫ్యాన్స్ ఇప్పుడు టార్గెట్ చేశారు. ముంబయ్‌లో జరిగిన కల్కి ఈవెంట్లో ప్రభాస్ డాషింగ్ లుక్స్‌ను చూపిస్తూ.. కౌంటర్ మీమ్స్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు మావోడి లుక్స్‌ చూసి మాట్లాడండ్రా.. బాలీవుడ్ బచ్చాస్ అంటూ.. నేరుగా నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

02.kalki: జక్కన్న స్ట్రాటజీ పట్టుకున్న నాగ్ అశ్విన్..

ఓ సినిమాపై ఉన్న ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను తప్పించుకోడానికి.. ఇప్పుడు మేకర్స్ రిలీజ్‌కు ముందే మా స్టోరీ ఇదని చెబుతున్నారు. అప్పుడెప్పుడో మగధీర సినిమా తర్వాత మర్యాద రామన్న సినిమాతో.. ఈ స్టాటజీని మొదలెట్టిన జక్కన్నను.. ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు. కల్కి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఇప్పుడు ఇదే చేశారు. కల్కి మూవీలో త్రీ వరల్డ్స్‌ ఉంటాయని.. కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా.. ఈ మూవీ వరల్డ్స్‌ లో ఉన్న ప్రజలు.. హెవెన్‌లా ఉన్న ఉన్న కాంప్లెక్స్‌ కోసం చేసే పోరాటం ఈ సినిమా అంటూ కల్కి స్టోరీ లైన్‌ ను లీక్ చేశాడు.

03.kajal: ఫ్యాన్స్‌ చేసిన పనికి కాజల్ ఎమోషనల్..

జూన్‌ 19th కాజల్‌ బర్త్‌ డే. ఈ బర్త్‌డే తో 39వ పడిలోకి అడుగుపెడుతున్న ఈ బ్యూటీకి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు కాజల్ హార్డ్‌ కోర్ ఫ్యాన్స్‌. తమ అభిమాన హీరోయిన్ బర్త్‌ డే సందర్భంగా 150 పేద పిల్లలకు ఫుడ్ పంచారు. అలానే ఈ నెలాఖరులోపు 50 మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తన బర్త్‌ డే రోజు అభిమానులు చేసిన ఈ పనిని చూసి ఎమోషనల్ అయింది కాజల్. తన ఫ్యాన్స్‌.. పేద్ పిల్లలకు ఫుడ్ డిస్టిబ్యూషన్‌కు చేసిన వీడియోను.. తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాళ్లందరికీ ప్రేమకు పొంగిపోయింది.

04.manchu: నా కెరీర్‌కు నా కుంటుంబమే అడ్డు.. లక్ష్మక్క షాకింగ్ కామెంట్స్..

తన కెరీర్‌కు తన కుంటుంబమే పెద్ద అడ్డు అంటూ.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు మంచు లక్ష్మీ. రీసెంట్‌గా యక్షిణి సిరీస్‌తో.. మన ముందుకు వచ్చిన ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫిల్మ్ కెరీర్‌ గురించి మాట్లాడారు. హీరోల సిస్టర్స్‌కు సౌత్ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు ఉండవని చెప్పారు. అంతెందుకు తాను నటిగా మారడం తన తండ్రికే ఇష్టం లేదంటూ చెప్పి .. తన మాటలతో అందర్నీ షాక్ అయ్యేలా చేశారు.

05.deepika: దీపిక డెడికేషన్‌కు.. చేతులెక్కి మొక్కుతున్న సెలబ్రిటీస్‌.

దీపిక డెడికేషన్‌ చూసి ఇప్పుడు బాలీవుడ్ జనాలు.. సెలబ్రిటీలు ఆమెకు చేతులెక్కి మొక్కుతున్నారు. ఇచ్చిన కమిట్మెంట్‌కు కట్టుబటి.. తను ప్రెగ్నెంట్‌ అయి కూడా.. సినిమాల్లో యాక్ట్ చేస్తున్న ఈ బ్యూటీ… కల్కి ప్రమోషన్స్‌కు కూడా డుమ్మా కొట్టకుండా.. ఎక్స్‌క్యూజెస్ చెప్పకుండా వచ్చింది. బేబీ బంప్‌తో ముంబయ్‌లో జరిగిన కల్కి ఈవెంట్లో హుషారుగా కనిపించింది. ఈవెంట్లో సెంట్రాఫ్ అట్రాక్షన్ అవ్వడమే కాదు.. తన డెడికేషన్తో ఇప్పుడు బీ టౌన్‌లో అందరి మన్ననలు పొందుతోంది.

06.darshn: చెవులు కోసి.. మర్మాంగాల మీద తన్ని.. హీరో దారుణ టార్చర్.

రేణుకా స్వామి హత్య కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. రేణుకా స్వామిని అత్యంత దారుణంగా దర్శన్ టీం హింసించి చంపిందనే నిజం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మరణానికి ముందు రేణుకాస్వామిపై విచక్షణారహితంగా దాడి చేసిన దర్శన్ టీం.. రేణుకా స్వామి వేడుకుంటున్నా పట్టించుకోకుండా.. అతడి వీపుపై వాతలు వచ్చేలా కొట్టారట. అంతేకాదు.. అతడి చెవులు కోసి.. చేతులకు కరెంటు షాక్‌లు ఇస్తూ దారుణంగా హిసించారట. ఇక దర్శన్ కూడా.. తీవ్ర కోపంతో.. రేణుకా స్మామి మర్మాంగాలపై దాడి చేశారట. దీంతో రేణుకా స్వామి మరణించినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో బయట పడింది. పోలీస్ విచారణలో కూడా ఇదే నిజం బయటికి వచ్చింది. దీంతో దర్శన్ హీరో కాదు రాక్షసుడనే కామెంట్ కన్నడ నాట వస్తోంది.

07.darshan: కన్నడ సీఎం సీరియస్.. హీరోగారి పరిస్థితి ముగినట్టే?

రేణుకా స్వామిని దర్శన్ అత్యంత పాశవికంగా.. దారుణంగా మర్డర్ చేయించాడనే నిజాలు బయటికి వస్తున్న వేళ.. కన్నడ సీఎం సిద్దరామయ్య ఈ మర్డర్ కేసుపై స్పందించారు. పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని అన్నారు. అంతేకాదు దర్శన్‌ను ఈ కేసు నుంచి తప్పించేలా.. తనపై ఒత్తిడి వస్తుందని వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు.

08.chiru heroin: 4 కోట్లు మోసపోయిన చిరు హీరోయిన్

మెగా స్టార్ చిరు అందరి వాడు సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ నటించిన రిమీ సేన్.. ఓ వ్యక్తి చేతులో దారుణం మోసపోయింది. అధిక వడ్డీకి ఆశపడిన ఈమె.. 3 ఏళ్ల క్రితం తన కామన్ ఫ్రెండ్ రోనక్ వ్యాస్‌కు విడతల వారీగా దాదాపు 4.14 కోట్లు అప్పుగా ఇచ్చింది. అధిక వడ్డీతో కలిపి ఆ అమౌంట్‌ 14 కోట్ల అయింది. దీంతో ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి ఇవ్వమని వ్యాస్‌ను అడిగితే.. పారిపోయాడని పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పుడా కేసు cidకి బదీలీ అయింది. మరో సారి ఈమోసపోయిన తీరు నెట్టింట వైరల్ అవుతోంది.

09.nayan: గజిని సినిమాలో నటించడం చెత్త నిర్ణయం

గజినీ సినిమాలో నటించడం తన జీవితంలోనే చెత్త నిర్ణయం ఒక చెత్త నిర్ణయమని చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు హీరోయిన్ నయనతార. గజినీ సినిమాలో ముందు అనుకున్నట్టుగా తన క్యారెక్టర్‌ను తెరకెక్కించలేదని.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఆ విషయంలో ఎవర్నీ తప్పుబట్టాల్సిన అవసరం లేదంటూ కాస్త సేఫ్ గా మాట్లాడే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఇలాంటి వాటినే గుణపాఠంగా తీసుకోవాలని అంటూ.. స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నయన్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on