TOP9 ET: రూ.555 కోట్లు కొల్లగొట్టిన కల్కి | రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు..

|

Jul 02, 2024 | 8:05 AM

బాలయ్య వారసుడు మోక్షజ్ఙ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు.. ఎట్టకేలకు అఫీషియల్ న్యూస్ వచ్చేసింది. వచ్చేస్తున్నా.. మీ బ్లెస్సింగ్స్‌ కావాలి అంటూ.. ఏకంగా మోక్షజ్ఙ అఫీషియల్ ఎక్స్‌ హ్యాండిల్ నుంచే ఓ ట్వీట్ బయటికి వచ్చింది. ట్వీట్ మాత్రమే కాదు.. దానికి తోడు.. మోక్షజ్ఙ ట్రెండీ నయా లుక్ పోస్టర్ మోక్షజ్ఙ హ్యాండిల్ నుంచే బయటికి వచ్చి.. నెట్టింట బ్రేకింగ్ న్యూస్‌గా మారిపోయింది.

01. Prabhas kalki: రూ.500 కోట్లు కొల్లగొట్టిన కల్కి.

రిలీజైన మొదటి రోజే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెంచరీ కొట్టిన కల్కి.. ఇప్పుడు ఏకంగా 500 కోట్ల మార్క్‌ను కూడా అవలీలగా దాటేసింది. జస్ట్ రిలీజ్ అయిన 4 రోజుల్లోనే ఈ మార్క్‌ను క్రాస్‌ చేసి.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీకెక్కింది. వరల్డ్ వైడ్ డే4… 555 కోట్లు కొల్లగొట్టి.. ఇప్పుడు టాక్ ఆప్‌ ది ఇండియాగా మారింది. ఇప్పుడు ఇండియాలో ఏది నడుస్తుంది అంటే కల్కే నడుస్తుంది అనే కామెంట్‌ని నెట్టింట వచ్చేలా చేసుకుంటోంది ఈ మూవీ.

02. mokshagna: అఫీషియల్ న్యూస్ వచ్చేసింది.. సినిమాల్లోకి వస్తున్న బాలయ్య అబ్బాయి.

బాలయ్య వారసుడు మోక్షజ్ఙ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు.. ఎట్టకేలకు అఫీషియల్ న్యూస్ వచ్చేసింది. వచ్చేస్తున్నా.. మీ బ్లెస్సింగ్స్‌ కావాలి అంటూ.. ఏకంగా మోక్షజ్ఙ అఫీషియల్ ఎక్స్‌ హ్యాండిల్ నుంచే ఓ ట్వీట్ బయటికి వచ్చింది. ట్వీట్ మాత్రమే కాదు.. దానికి తోడు.. మోక్షజ్ఙ ట్రెండీ నయా లుక్ పోస్టర్ మోక్షజ్ఙ హ్యాండిల్ నుంచే బయటికి వచ్చి.. నెట్టింట బ్రేకింగ్ న్యూస్‌గా మారిపోయింది.

03. kalki krishna: దిమ్మతిరిగే న్యూస్.. కల్కి2లో కృష్ణుడిగా యంగ్ టైగర్.!

రీసెంట్‌గా రిలీజ్ అయిన కల్కి సినిమాలోని మహాభారత రిఫరెన్స్‌ సీన్లు.. అందరికీ గూస్ బంప్స్‌ పుట్టిస్తున్నాయి. అందులోనూ కృష్ణుడిగా ఏదైనా స్టార్ హీరోను చూపిస్తే బాగుండు అనే అభిప్రాయాలు కూడా మూవీ రిలీజ్ అయిన డే1 నుంచి వస్తున్నాయి. ఇక ఈ కమ్రంలోనే కల్కి సెకండ్ పార్ట్‌లో.. కృష్ణుడిగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను తీసుకునే ఆలోచన చేస్తున్నారట నాగి. అశ్వనీదత్ సీనియర్ ఎన్టీఆర్ అభిమాని కావడంతో.. తన కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ ను లార్డ్‌ కృష్ణుడిగా క్యాస్ట్ చేయబోతున్నారట నాగి. ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చి నెట్టింట వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులను ఎగిరి గంతేసేలా చేస్తోంది.

04. kalki2: “కల్కి 3102 BC” బయటికి వచ్చిన కల్కి2 టైటిల్..

ఇనీషియల్ స్టేజ్‌లో … ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్‌తో మొదలైన హీరో ప్రభాస్ డైరెక్టర్ నాగీల పాన్ ఇండియా మూవీకి ఆ తరువాత కల్కి 2898ad అంటూ టైటిల్ ఫిక్స్ చేశారు నాగి అండ్ టీం. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవడంతో పార్ట్ 2 పై అంచనాలను పెంచేసింది. దీంతో సెకండ్ పార్ట్‌ కు టైటిల్ ఏమై ఉంటుందనే క్యూరియాసిటీ అందరికీ మొదలైంది. ఇక ఈ క్యూరియాసిటీని కిల్ చేస్తూనే… కల్కి సెకండ్ ఫిల్మ్ టైటిల్ కల్కి 3102BC గా నాగి అండ్ టీం నిర్ణయించినట్టు ఓ టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

05.kalki: టీం ఇండియా దెబ్బకి షేక్ అయిన కల్కి

టీం ఇండియా దెబ్బకి కల్కి థియేటర్స్ షేక్ అయ్యాయి. పేరుకు కల్కి ఫస్ట్ షో సినిమా చూస్తున్నప్పటికీ.. థియేటర్లో ఆడియెన్స్‌ అందరూ.. ఫోన్లలో మ్యాచ్ అప్డేట్స్ చూస్తూనే థియేటర్లో కూర్చుకున్నారు. అలా చూస్తున్న క్రమంలోనే టీం ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంతో.. థియేటర్లో సంబరాలు చేసుకున్నారు. ఇండియా.. ఇండియా అంటూ అరిచి గోలగోల చేశారు. కల్కి థియేటర్లో వస్తున్న డాల్బీ సౌండ్‌ను కూడా.. తమ అరుపులతో డామినేట్ చేశారు.

06. kreishnam: 40 ఏళ్ల క్రితం పెదనాన్న మొదలెట్టిన సినిమా.. ఇన్నాళ్లకు కల్కితో ఫినిష్ చేసిన ప్రభాస్‌.

ఇప్పుడంటే కల్కి సినిమాతో ప్రభాస్ దిమ్మతిరిగే హిట్ కొట్టారు కానీ.. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు మాత్రం ఎప్పుడో 40 ఏళ్ల క్రితమే కల్కి పేరుతో ఓ మూవీని మొదలెట్టారట. కొంత పార్ట్‌ షూట్ కూడా చేశారట. కీరవాణి అదిరిపోయే ఓ సాంగ్‌ను కూడా కంపోజ్‌ చేసి ఈ సినిమా కోసం ఇచ్చారట. కానీ ఎందుకనో ఆ సినిమా ఆగిపోయిందని.. రీసెంట్‌గా రివీల్ చేశారు కృష్ణం రాజు భార్య శ్యామలా..! అయితే ఈమె చెప్పిన మాటలే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

07.kalki: బాహుబలి2 రికార్డ్‌ ను బద్దలు కొట్టిన కల్కి

కల్కి మూవీ బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టింది. అయితే డే1 వరల్డ్‌ వైడ్ కలెక్షన్స్‌లో మాత్రం కాదు.. ఫాస్ట్‌గా 500 క్రోర్స్ కమాయించడంలో..! ఎస్ ! జూన్ 27 రిలీజ్ అయిన కల్కి మూవీ రిలీజ్‌ అయిన కేవలం 4 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌ 555 క్రోర్ గ్రాస్‌ను వసూలు చేసింది. వెరీ ఫాస్ట్‌గా.. 500 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ ఫీట్‌తోనే బాహుబలి2 ను బీట్ చేసింది. నయా రికార్డ్‌ను నెలకొల్పింది.

08.rgv: కల్కీ డబ్బులు దాచుకోడానికి. వాళ్లు ఓ బావి తవ్వాలేమో..

ఎప్పుడూ సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్‌ చేసే ఆర్జీవీ.. మరో సారి అలాంటి క్రేజీ కామెంట్సే చేశారు. రీసెంట్ గా రిలీజ్‌ అయి వండర్ ఫుల్ టాక్ తెచ్చుకున్న కల్కి మూవీలో క్యామియో చేసిన ఆర్జీవీ.. ఈ సినిమా వసూలు చేస్తున్న డబ్బులను దాచుకోవాలంటే.. ప్రొడ్యూసర్ అశ్వనీదత్, స్వప్నా దత్‌ ఓ బావి తవ్వాలేమో అంటూ.. తన ట్వీట్లో రాసుకొచ్చారు. మరో సారి తన ట్వీట్లోని రాతతో క్రేజీ రియాక్షన్ వచ్చేలా చేసుకుంటున్నారు.

09.mrunal: రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు..

చూడ్డానికి అందంగా.. ఉన్నా.. అప్పుడప్పుడు చిలిపి కామెంట్స్‌తో పాటు.. తన మనసులోని మాటలను బయటపెట్టే మృణాల్ ఠాకూర్ తాజాగా రొమాన్స్ గురించి మాట్లాడారు. రొమాన్స్ అంటే అందరూ అనుకునేది కాదని.. తన దృష్టిలో రొమాన్స్ అంటే ఏంటో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రొమాన్స్ అనేది చిన్న చిన్న చేష్టలతోనే ఉంటుందని.. మనకు నచ్చిన వాళ్లు మనతో నిజాయతీగా ఉండటం, మనపట్ల శ్రద్ధ చూపించడం, మన కోసం చిన్న చిన్న పనులు చేయడం, మన ఆలోచనలో ఉండడమే రొమాన్స్ అంటూ… రొమాన్స్‌కు కొత్త నిర్వచనం ఇచ్చారు ఈ బ్యూటీ. ఇక తన మాటలతో.. తన రొమాంటిక్ లుక్స్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఈమె.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.