షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నారో తెలుసా

Edited By: Phani CH

Updated on: Dec 10, 2025 | 1:17 PM

టాలీవుడ్‌లో హీరోలు వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. చలిని సైతం లెక్కచేయకుండా మహేష్ బాబు, ప్రభాస్, నాని, అల్లు అర్జున్, చిరంజీవి వంటి స్టార్స్ తమ చిత్రాల చిత్రీకరణలో నిమగ్నమయ్యారు. హెలో నేటివ్, ఆర్ఎఫ్‌సీ, అన్నపూర్ణ స్టూడియోలు, కోఠి, అల్యూమినియం ఫ్యాక్టరీ వంటి ప్రదేశాల్లో ప్రస్తుతం అనేక సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

టాలీవుడ్‌లో షూటింగ్స్ హడావిడి మామూలుగా లేదు.. వణికించే చలిలోనూ వరస షూటింగ్స్ చేస్తూ అస్సలు తగ్గేదేలే అంటున్నారు మన హీరోలు. ఒకరిద్దరు మినహాయిస్తే.. మిగిలిన హీరోలంతా కెమెరా ముందే బిజీ అయ్యారు. మరి ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతుంది.. ఏ హీరో ఎక్కడున్నాడో ఈ రోజు షూటింగ్స్ స్పెషల్ ప్యాక్‌లో చూద్దామా..? షూటింగ్ ప్యాక్‌లో ముందుగా హెలో నేటివ్ స్టూడియోలో ఏం జరుగుతున్నాయో చూద్దాం..! నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ప్యారడైజ్‌తో పాటు.. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న స్కందవాహన పిక్చర్స్, రాజహంస బ్యానర్‌లో జేడీ చక్రవర్తి నటిస్తున్న సినిమా, శర్వానంద్ భోగి సినిమాల షూటింగ్స్ హెలో నేటివ్‌లో జరుగుతున్నాయి. ఇక మహేష్ బాబు వారణాసి షూటింగ్ RFCలో జరుగుతుంది. ప్రభాస్, సందీప్ వంగా కాంబోలో వస్తున్న స్పిరిట్ సినిమా షూటింగ్ వారం రోజులుగా కోఠిలో జరుగుతుంది. చిరంజీవి, అనిల్ రావిపూడి మన శంకర ప్రసాద్ గారు షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో.. అల్లు అర్జున్ AA22 షూట్ ముంబైలో.. రవితేజ, శివ నిర్వాణ సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతున్నాయి. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమా షూటింగ్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబోలో వస్తున్న సినిమా షూటింగ్ అల్యూమీనియం ఫ్యాక్టరీలోనే జరుగుతుంది. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటి గట్టు షూటింగ్ తుక్కుగూడలో.. నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో జరుగుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైనా అమ్మాయి వెడ్స్‌ ఝార్ఖండ్‌ అబ్బాయి.. వీరి అద్భుత ప్రేమ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

విచిత్ర వివాహం.. శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడిన యువతి

సర్పంచ్ బరిలో అతని ఇద్దరు భార్యలు.. చివరికి ట్విస్ట్ అదిరింది

పర్వతంపైకి తీసుకెళ్లి ప్రియురాలిని వదిలేసిన ప్రియుడు.. చలికి గడ్డ కట్టి..

రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ.. కానీ అంతలోనే ఇలా..