Peddi: పెద్దిపై మరో పిడుగు.. రామ్ చరణ్ ఏం చేస్తారో..?

Edited By:

Updated on: Apr 09, 2026 | 7:04 PM

రామ్ చరణ్ 'పెద్ది' సినిమా రిలీజ్ డేట్‌పై టాలీవుడ్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఏప్రిల్ 8 అడ్వాన్స్ బుకింగ్‌లు హోల్డ్‌లో పెట్టడంతో వాయిదా ఖాయమైనట్లు తెలుస్తోంది. నాణ్యత కోసం చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా, జూన్ 25న విడుదల కావచ్చని చర్చ నడుస్తోంది. అఖిల్ సినిమాతో డేట్ క్లాష్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

అన్నీ చెప్తున్నారు కానీ ఆ ఒక్క ముక్క చెప్పట్లేదేంటబ్బా.. రామ్ చరణ్ పెద్ది సినిమా విషయంలో టాలీవుడ్‌లో జరుగుతున్న ఇంట్రెస్టింగ్ చర్చ ఇది. దీని రిలీజ్ డేట్‌పై ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఓసారి వస్తుందంటారు.. మరోసారి రాదంటారు. తాజాగా పెద్ది వాయిదాపై మరో సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చింది. మరి అదేంటో చూద్దామా..? పెద్ది వాయిదాకు ముహూర్తం ఖరారైపోయినట్లే. జస్ట్ వాళ్లు అధికారికంగా చెప్పడమే తరువాయి. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8 పెద్ది ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావాల్సి ఉండగా హోల్డ్‌లో పెట్టేసారు. దీంతో ఈ సినిమా పోస్ట్‌పోన్ అవుతుందనే వార్తలకు ఇది మరింత బలం చేకూరుతుండగా.. ఫ్యాన్స్‌కి మాత్రం అసలు ఏం జరుగుతుందో అర్థం కాక తెగ టెన్షన్ పడుతున్నారు. రామ్ చరణ్‌తో పాటు చిత్ర యూనిట్ అంతా ఎంత రాత్రింబవళ్లు కష్టపడుతున్నా అనుకున్న సమయానికి క్వాలిటీ ఔట్‌పుట్ తీసుకురావడం కొంచెం కష్టంగానే మారిందని అర్థమవుతుంది. అందుకే ఇక చేసేదేం లేక వాయిదా నిర్ణయానికి వచ్చారని.. దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ రిలీజ్ వాయిదా పడితే కొత్త డేట్ ఎప్పుడనే దానిపై కూడా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం జూన్ 25న పెద్దిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ డేట్ కూడా మైత్రి మూవీ మేకర్స్ చేతుల్లోనే ఉంది.. ఇదే డేట్‌ను ఎన్టీఆర్, నీల్ కోసం లాక్ చేసారు వాళ్లు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. పెద్దితో పోటీ ఎందుకని అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా మే 1 నుంచి జూన్ 26కి వాయిదా పడింది. కానీ పెద్ది సినిమా మళ్లీ వెళ్లి లెనిన్‌కు ఒక్కరోజు ముందు అంటే జూన్ 25న రాబోతుంది. ఇది చూసి ఇదెక్కడి విచిత్రంరా బాబు.. అఖిల్‌ను చరణ్ ఏంటి ఇలా వెంబడిస్తున్నారంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. చూడాలిక.. ఏం జరగబోతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Anna Lezhneva: ఒకరికి బర్త్‌డే.. మరొకరికి పునర్జన్మ.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: క్రూరుడు.. కత్తిలాంటి కుర్రాడు.. బన్నీ డ్యుయల్ రోల్

‘అటు మామ.. ఇటు బావ..’ అబ్బో.. ఖుషీగా బన్నీ

TOP 5 ET: ఆయనే ముందు ప్రపోజ్ చేశారు.. – అన్నా

Virat Kohli: ధురంధర్‌కి విరాట్‌ ఫిదా.. నీలాగే నేను కూడా అంటూ.. డైరెక్టర్‌ ట్వీట్

Follow Us