షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోందో

Edited By:

Updated on: Jul 15, 2026 | 9:15 PM

టాలీవుడ్ స్టార్ హీరోలు వరుస చిత్రాల షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఆర్‌ఎఫ్‌సీ, హలో నేటివ్ స్టూడియో, శంకరపల్లి, మోకిళ్ల, అజీజ్‌నగర్, గండిపేట వంటి ప్రాంతాల్లో భారీ చిత్రాల చిత్రీకరణలు కొనసాగుతున్నాయి. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, వెంకటేష్, విజయ్ దేవరకొండ తదితర హీరోలు తమ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

షూటింగ్ షూటింగ్ షూటింగ్.. మన హీరోలను ఎవరిని కదిపినా ఇప్పుడిదే అంటున్నారు. ఎవర్ని చూసినా లొకేషన్‌లోనే కనిపిస్తున్నారు. ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తయ్యే వరకు నో బ్రేక్స్ అంటున్నారు. ఒకరిద్దరు మినహాయిస్తే మిగిలిన వాళ్లందరూ షూటింగ్స్‌తోనే బిజీ బిజీగా ఉన్నారు. సీనియర్ హీరోలు సైతం నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెంచేసారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూద్దామా..? ముందుగా హెలో నేటివ్ స్టూడియోలో జరుగుతున్న షూటింగ్స్‌ను చూద్దాం.. నాని, శ్రీకాంత్ ఓదెల చేస్తున్న ప్యారడైజ్‌తో పాటు.. ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్న అధీరా షూట్స్ ముచ్చింతల్‌లోనే జరుగుతున్నాయి. ప్రభాస్ ఫౌజీ షూట్ RFCలో జరుగుతుంది.. అక్కడే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా షూట్ కూడా జరుగుతుంది. ఇక స్పిరిట్ షూటింగ్ అజీజ్‌నగర్‌లో జరుగుతుంది. అల్లు అర్జున్ రాకా షూటింగ్ కొన్ని నెలలుగా ముంబైలోనే జరుగుతుంది. వారణాసి షూట్ కూడా గత నెల రోజులుగా శంషాబాద్ తాహెర్ స్టూడియోలో జరుగుతుండగా.. వెంకటేష్, అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్ షూట్ మోకిళ్లలో జరుగుతుంది. అలాగే వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం షూట్ శంకరపల్లిలో జరుగుతుంది. శ్రీ విష్ణు రామ్ అబ్బరాజు షూట్‌తో పాటు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ కూడా శంకరపల్లిలోనే జరుగుతుంది. గోపీచంద్, వెంకట్ కాంబినేషన్‌లో వస్తున్న సింగ షూట్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రణబాలి షూటింగ్ బేతంచర్ల నుంచి గండిపేటకు షిఫ్ట్ అయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. అకౌంట్లో బ్యాలెన్స్‌ చూసి షాక్‌!

రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

కదులుతున్న రైలులో పూజ‌లు.. రైల్వే అధికారుల రియాక్షన్‌ ఇదే!

పోలీసువైనంత మాత్రాన చట్టం నీ చుట్టం కాదు బాస్‌!

Vijay Deverakonda: అభిమానికి విజయ్‌ దేవరకొండ అభయం!

Follow Us