TOP 9 ET News: ఇరుముడి సూపర్ హిట్.. రూ.కోట్లలో జాక్ పాట్ కొట్టిన రవన్న | సొంత థియేటర్లోనే టాక్సిక్ హవా
ఎన్నో అంచనాల మధ్యలో రిలీజ్ అయిన యశ్ టాక్సిక్ మూవీ డే1 దిమ్మతిరిగే కలెక్షన్స్‌ను రాబట్టింది. నెగెటివ్ టాక్ మధ్యలోనూ వరల్డ్ వైడ్ ఏకంగా 150 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. ఈ రేంజ్ ఓపెనింగ్స్‌తో అందర్నీ అవాక్కైయ్యేలా కూడా చేసింది. అయినా కానీ ఈ మూవీ మేకర్సకు నష్టాలు తప్పవని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. రిపోర్ట్స్ ప్రకారం టాక్సిక్ మూవీకి 500 కోట్ల నుంచి 600 కోట్ల రూపాయలను మేకర్స్ ఖర్చు చేశారు. ఇంగ్లీష్‌తో సహా పలు లాంగ్వేజెస్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కానీ ఇప్పటికే ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకోవడం... యశ్ ఫ్యాన్స్‌తో సహా ఫిల్మ్ లవర్స్ ను డిస్సపాయింట్ చేయడంతో.. బ్రేక్ ఈవెన్‌ను చేరుకోవడం కష్టని ఫిల్మ్ అనలిస్టులు చెబుతున్నారు.
టాక్సిక్‌తో నో లాస్.. మెలికతో బచాయించిన దిల్ రాజు: టాక్సిక్ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో.. తెలుగు టూ స్టేట్స్‌లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు.. గురించే అందరూ మాట్లాడుకుంటున్నాకు. దిల్ రాజుకు భారీగా నష్టాలు తప్పవంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అయితే టాక్సిక్ విషయంలో దిల్ రాజు కు ఎలాంటి నష్టముండని తెలుస్తోంది. ఎందుకంటే సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా బయ్యర్లను సేఫ్ చేయడానికి దిల్ రాజు ‘రిటర్నబుల్ అడ్వాన్స్’ ఫార్ములను ఇక్కడ వాడారట! సినిమా ఆడకపోతే 15 రోజుల్లో డబ్బులు వెనక్కి ఇచ్చేలా KVN సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నారు దిల్ రాజు. దీంతో ఇక్కడి బయ్యర్లకు రూపాయి నష్టం టాక్సిక్ వల్ల రాదని తెలుస్తోంది.
ఐకాన్ స్టార్ రేంజ్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి మరో అరుదైన గౌరవం దక్కింది. Forbes India లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజీపై ఆయన చోటు దక్కించుకున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా ఎదిగిన బన్నీ బ్రాండ్ వాల్యూ విషయంలోనూ టాప్‌లో ఉన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ‘షో స్టాపర్స్’ ఎడిషన్లో సినిమా, క్రీడలు, టెలివిజన్, సంగీతం, కళలు, ఫ్యాషన్ రంగాలకు చెందిన ప్రముఖులకు Forbes స్థానం కల్పించింది.
దసరా బరిలో: విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ సినిమా రిలీజ్ వాయిదా పడింది. వాస్తవానికి సెప్టెంబర్ 11న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
రివ్యూతో సంబంధం లేకుండా టాక్సిక్ అరుదైన రికార్డు: యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’ మూవీ తొలిరోజే రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఒకే టికెటింగ్ ప్లాట్ ఫార్మ్‌లో సింగిల్ డేలో 9.05 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 120 కోట్లు వసూలు చేసిందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
ధురంధర్ 2 రికార్డ్ బద్దలుకొట్టిన టాక్సిక్: ప్రేక్షకుల ముందుకు వచ్చిన యశ్ ‘టాక్సిక్’ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘ధురంధర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డును బ్రేక్ చేసింది. భారీ ఓపెనింగ్స్‌తో తొలిరోజే వంద కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. థియేటర్‌లో సీన్లు రికార్డ్ చేసి లీక్ చేయొద్దంటూ చిత్ర బృందం ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది.
రాజీ కుదిరిందా.. గొడవ ముగిసినట్టు ఉంది: నటి కంగనా రనౌత్‌తో తనకున్న వివాదం గురించి పదే పదే అడగొద్దని తాప్సీ మీడియాను కోరారు. ఈ ప్రశ్నలు అడగడం ఆపేస్తే ఆ వివాదానికి ఎప్పుడో ముగింపు పడేదని ఓ మూవీ ఈవెంట్‌లో ఆమె స్పష్టం చేశారు. గతంలో తాప్సీ చేసిన కామెంట్స్ మీద ఇటీవల కంగనా రియాక్ట్ అవ్వటంతో మరోసారి ఈ ఇద్దరి మధ్య ఉన్న గొడవ తెర మీదకు వచ్చింది.
కష్టకాలంలో అనన్యను విడిచిపెట్టిన లవర్: ఓ పక్క సినిమా ఛాన్సులు లేక ఢీలా పడిన అనన్య పాండేకు తన భాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ కూడా ఇబ్బంది పెడుతున్నట్టు బాలీవుడ్ చెబుతోంది. అనన్య పాండే తన బాయ్‌ఫ్రెండ్ వాకర్ బ్లాంకోతో విడిపోయారట. రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట, పరస్పర అంగీకారంతోనే బ్రేకప్ చెప్పుకున్నట్టు తెలుస్తోంది. 2024 అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో వీరు మొదటిసారి కలుసుకున్నారు. గత వారం అనన్యనే ఈ రిలేషన్‌షిప్‌కు ముగింపు పలికారన్న న్యూస్ బాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.
జాతీయ జెండా రంగులతో గౌను వివాదంలో ఊర్వశీ: మిస్ యూనివర్స్ ఇండియా 2026 ఈవెంట్‌కు జడ్జిగా వెళ్లిన ఊర్వశి రౌతెలా, త్రివర్ణ పతాకాన్ని పోలిన గౌను ధరించటం గురించి వస్తున్న విమర్శలపై స్పందించారు. తన డ్రెస్ ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘన కాదని క్లారిటీ ఇచ్చారు. ఇది జాతీయ జెండాకు అసలైన ప్రతిరూపం కాదని, కేవలం భారతీయతను ప్రతిబింబించేలా డిజైన్ చేసిన ఆర్ట్ మాత్రమేనని వివరణ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price: పసిడి పరుగులు.. ఇవాళ తులం బంగారం ధర ఇదే!
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
ఎయిర్‌హోస్టెస్ నుంచి పోలీస్ ఆఫీసర్‌గా వచ్చింది.. అవినీతి ఊబిలో చిక్కుకొని..
2026 Lunar Eclipse: ఆగస్టు 28న ఆకాశంలో అద్భుతం.. భారత్‌లో కనిపిస్తుందా?
గంటల తరబడి మొబైల్ చూస్తున్నారా? మీ వెన్నెముకకు ముప్పు తప్పదు!
