Top 9 ET: రాజాసాబ్ నిర్మాతను గట్టెక్కించిన ప్రభాస్ | 400 కోట్ల వైపు దూసుకుపోతున్న చిరు సినిమా
చిరు మన శంకర వర ప్రసాదు గారు సినిమా.. 400 కోట్లవైపు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. సంక్రాంతి సంబరం ముగిసినప్పటికీ.. చిరు సినిమా సంబరం ఇంకా ప్రేక్షకుల్లో కనిపిస్తూనే ఉంది. దీంతో ఈ మూవీకి స్టిల్ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే థియేటర్లలో రెండు వారాల రన్ పూర్తి చేసుకున్న మన శంకర వర ప్రసాదు గారు సినిమా.. ఇప్పటికే వరల్డ్ వైడ్ 350 కోట్లను వసూలు చేసింది. ఇక థియేటర్లలో ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే.. ఈ మూవీ 400 కోట్ల మార్క్ చేరుకోవడం చాలా ఈజీగా కనిపిస్తోంది.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ ది రాజాసాబ్.. బాక్సాఫీస్ దగ్గర సరిగా పర్ఫార్మ్ చేయలేకపోయింది. కలెక్షన్స్‌లోనూ వెనకపడిపోయింది. దీంతో ప్రొడ్యూసర్ భారీగా నష్టాల పాలయ్యాడనే టాక్ ఉంది. అయితే రాజా సాబ్ ప్రొడ్యూసర్‌కు ప్రభాస్ అండగా నిలబడ్డారని.. నష్టాల నుంచి గట్టెక్కించారని ఇప్పుడో న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. నష్టాలను భర్తీ చేసేందుకు.. ఫ్యూచర్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మరో సినిమా చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పారని.. ఈ విషయంగా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్‌కు రెబల్ స్టార్ మాట ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అంతేకాదు స్పిరిట్ మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను.. మైత్రీ మూవీస్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అందేలా ప్రభాస్ చూస్తున్నారని మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఇక రెమ్యునరేషన్ విషయంలోనూ ప్రభాస్ ప్రొడ్యూసర్‌కు అండగా ఉన్నట్టు తెలుస్తోంది. రాజాసాబ్ కోసం ముందుగా మాట్లాడుకున్న పూర్తి రెమ్యునరేషన్‌ను కూడా తీసుకోలేదని టాక్ ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
Allu Arjun: సందీప్ ఓకే.. మరి ఆ స్టార్ డైరెక్టర్ల మాటేంటి బన్నీ
Anil Ravipudi: మరిచిపోండి! ఎప్పటికీ రమణ గోగుల సాంగ్ రిలీజ్ కాదు
Bhagavanth Kesari Sequel: భగవంత్ కేసరికి సీక్వెల్.. అరిపించే న్యూస్ చెప్పిన అనిల్
Akira Nandan: అకీరాపై AI డీప్ ఫేక్ వీడియో.. దెబ్బకు కాకినాడ కుర్రాడి అరెస్ట్
