TOP 9 ET: చిక్కుల్లో చిరు నెక్స్ట్ మూవీ ?? | బుక్ మై షోలో.. బాస్ దిమ్మతిరిగే రికార్డ్
రీజినల్ సినిమాల్లో ఆన్‌లైన్ టికెటింగ్ యాప్స్‌లో సరికొత్త రికార్డులకు ‘మన శంకరవరప్రసాద్ గారు’ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా 5.2 మిలియన్ టికెట్ బుక్ అయ్యాయి. ఏ రీజనల్ సినిమాకు అయినా ఇదే హైయ్యస్ట్ టికెట్స్ బుక్ అవ్వడం అని మేకర్స్ ప్రకటించారు. రెండో వారంలోనూ ఈ సినిమా దూకుడు చూపిస్తుంది.
జననాయగన్ రిలీజ్ ఎఫెక్ట్ ఇప్పుడు చిరు నెక్ట్స్ సినిమా మీద పడుతోందనే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. చిరు- బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న Mega158 సినిమా కేవీఎన్ ప్రొడక్షన్లో తెరకెక్కనుంది. జన నాయగన్ సినిమాను కూడా కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో చిరంజీవి మూవీతో ఎంట్రీ ఇవ్వాలని ఆ సంస్థ ప్లాన్ చేసుకుంది. ఇప్పటికే మెగా 158 ప్రాజెక్ట్‌తో నిర్మాతలు వెంకట్ కె. నారాయణ, నిషా వెంకట్ కొనంకి ఢీల్ కుదుర్చుకున్నారు. అయితే జన నాయగన్ సెన్సార్ గొడవ కారణంగా ఆ సంస్థ కోర్టు చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో చిరు- బాబీ సినిమా మరింత ఆలస్యం కానుందని వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సిన చిరంజీవి మూవీ.. జన నాయగన్ ఎఫెక్ట్ వల్ల మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. అయితే, అంత వరకు చిరు, బాబీ వేచి చూస్తారా..? అనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
The Raja Saab: రాజాసాబ్‌కు రూ.100 కోట్ల నష్టం ??
షాకింగ్ న్యూస్.. అరికాళ్ళపై షుగర్ దాడి
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
