TOP 9 ET: గుడ్ న్యూస్.. NTR ఫ్యాన్స్‌కు పెద్ది స్వీట్ సర్‌ప్రైజ్ | పెద్ది కోసం రంగంలోకి ధోని
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కబోతోంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటసింహం బాలకృష్ణ హీరోగా ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక పవర్‌ఫుల్ టైటిల్ ఖరారైనట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి ‘కార్పెంటర్’ అనే విభిన్నమైన టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమా టీజర్ మే 20న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. ‘డ్రాగన్’ టీజర్‌ను జూన్ 4న విడుదల కాబోయే ‘పెద్ది’ సినిమాతో జత చేస్తున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ప్రమోషన్లు ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో లేవని మెగా అభిమానులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. అయితే, ఈ లోటును పూడ్చేందుకు చిత్ర యూనిట్ ఒక భారీ ‘మైండ్ బ్లాకింగ్’ ప్లాన్‌తో సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సినిమా క్రీడా నేపథ్యం (స్పోర్ట్స్ డ్రామా), ముఖ్యంగా క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుండటంతో, ప్రమోషన్ల కోసం ధోనిని అతిథిగా తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.తాజా సమాచారం ప్రకారం, జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒక భారీ ఈవెంట్‌ను నిర్వహించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
Siri Hanumanth: ఇన్‌స్టా సబ్ స్క్రిప్షన్ మొదలెట్టిన సిరి.. అప్పుడే లక్షల్లో సంపాదన!
Peddi: బాబాయ్ రికార్డ్‌ను బద్దలుకొట్టిన.. అబ్బాయ్
Trisha: విజయ్ మౌనం నాకు నచ్చదు..!
త్రిష పక్కనుంటే ఇక అంతే.. విజయ్ భవిష్యత్తు పై జోస్యం చెప్పిన వేణు స్వామి
