Vijay: భార్య దెబ్బతో.. షాక్ లో విజయ్.. మరి రాజకీయ పరిస్థితి ఏంటో

Updated on: Feb 28, 2026 | 8:08 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దళపతికి విడాకుల షాక్ తగిలింది. భార్య సంగీత చంగల్ పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. రాజకీయాల్లోకి వద్దామనుకున్న విజయ్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ. త్రిషతో విజయ్‌కు వివాహేతర సంబంధం ఉందనే పుకార్లే దీనికి కారణమని కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దళపతికి బిగ్ షాక్ తగిలింది. సినిమాలకు గుడ్ బై చెప్పి.. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనకున్న దళపతికి.. ఇంట్లోనే చుక్కెదురైంది. విజయ్‌ భార్య సంగీత తన భర్త నుంచి విడాకులు కావాలంటూ చంగల్ పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో సంచలనంగా మారింది. విజయ్‌ వివాహేతర సంబంధం కారణంగానే సంగీత విడాకుల పిటిషన్‌కు కారణం అని తెలుస్తోంది. అయితే దీనిపై విజయ్‌ నుంచి ఎలాంటి రియాక్షన్ బయటికి రాలేదు. ఇక ఈ విషయం కాస్త పక్కకు పెడితే.. అప్పట్లో సంగీత విజయ్‌ని గాఢంగా ప్రేమించింది. 1999లో వీరి పెళ్లి జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దళపతి భార్య సంగీత.. తన భార్త నుంచి విడాకులకు కావాలంటూ.. చంగల్ పట్టు కోర్టులో విడాకుల పిటిషన్‌ వేసింది. దీంతో ఇప్పుడందరూ కోలీవుడ్ హీరోయిన్ త్రిష వైపే చూస్తున్నారు. ఎందుకంటే వీరిద్దరి మధ్య లవ్‌ ఎఫైర్ ఉందనే టాక్ కోలీవుడ్‌ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. దానికి తోడు.. రీసెంట్‌గా కోలీవుడ్ బీజేపీ నేత నైనార్ కూడా విజయ్‌కి త్రిషకు రిలేషన్ అంటగుడుతూ ఇటీవల ఓ కామెంట్ చేశాడు. దీనిపై త్రిష రియాక్టవడంతో. తన మాటలను వెనక్కి తీసుకున్నాడు. ఈ క్రమంలోనే సంగీత తన భర్త తో విడాకులు కావాలంటే కోర్టు మెట్లెక్కడం ఇప్పుడు లేని పోని అనుమానాలకు .. కామెంట్లకు .. వార్తలకు కేరాఫ్‌గా మారుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Tirumala Free Bus: తిరుమలలో ఉచిత బస్సులు.. రోజూ ఎంతమంది ప్రయాణిస్తారంటే

బరువు తగ్గి సన్నజాజి తీగల్లా మారుతున్న హీరోయిన్లు

టెక్నాలజీ లేదు కానీ సినిమాలు మాత్రం సిద్ధమైపోతున్నాయి

8 వారాల OTT రూల్.. మునిగిపోయేది నిర్మాతలే

Anil Ravipudi: దగ్గుబాటితో నందమూరి.. అనిల్ ప్లాన్ అదుర్స్

Follow Us