తొందరేంటి.. కనీసం చెప్పేవరకు ఆగరా..?
తెలుగు సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రంపై వస్తున్న ఊహాగానాలను ఖండించారు. వెంకటేష్, ఫహద్ ఫాసిల్, కార్తీ వంటి హీరోల పేర్లు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో, కథ ఇంకా మొదలుపెట్టలేదని, తన అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల లక్ష్యంగా ఆగస్టు నుండి చిత్రీకరణకు ప్రణాళికలున్నాయి.
తెలుగు సినిమా రంగంలో ప్రస్తుతం గోల్డెన్ టైమ్ అనుభవిస్తున్న దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. రాజమౌళి తర్వాత అపజయం లేకుండా వరుస విజయాలతో ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించిన ఆయన, రీజనల్ కథలతో తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఆయన తదుపరి చిత్రంపై చర్చలు, ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
వెంకటేష్ హీరోగా నటిస్తారని, ఆయనతో పాటు ఫహద్ ఫాసిల్ లేదా కార్తీ వంటి మరో హీరో కూడా ఉంటారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ పుకార్లపై స్వయంగా అనిల్ రావిపూడి స్పందించారు. “నా సినిమా కథ ఇంకా మొదలుపెట్టలేదు. నా నెక్స్ట్ సినిమా ఏంటో నాకే తెలియదు. దయచేసి రూమర్స్ ఆపండి. కన్ఫర్మ్ అయ్యాక నేనే చెప్తాను” అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
Loading...
Unable to load recommendations.
Follow Us
