సూర్య కాంతాన్ని మించేస్తున్న తనూజ కాతం !! పాపం బిగ్ బాస్
బిగ్‌బాస్ 13వ వారంలో తనూజ నామినేషన్స్ తీరు ప్రేక్షకులకు చికాకు తెప్పించింది. సీరియల్ నటనతో, కన్నీళ్లతో ఇమ్మాన్యుయేల్‌ను మోసం చేసిన ఆమె, ఆపై పవన్‌పైకి దూసుకెళ్లింది. వాదనలో భాగంగా షుగర్ బాటిల్ తన నెత్తిన కొట్టుకుని, తాను హౌస్‌కి "కంటెంట్ క్వీన్" అని మరోసారి నిరూపించుకుంది. ఆమె డ్రామా బిగ్‌బాస్ ఇంటిని వేడెక్కించింది.
సీరియల్ యాక్టింగ్‌కు.. డ్రామాకు.. వితండ వాదానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన తనూజ… ఎప్పటిలానే 13వ వారం నామినేషన్స్‌లో కూడా బీబీ ఆడియన్స్‌కు చికాకు కలిగించింది. నామినేష్స్‌లో తన వంతు వచ్చినప్పుడు చాలా తెలివిగా.. ఇమ్మూ పేరును తీసిన తనూజ… కళ్లలో నీళ్లు తెచ్చుకుని మరీ.. ఇమ్మూతో ఫ్రెండ్ షిప్ గురించి.. వెన్ను పోటు గురించి పెద్ద పెద్ద కామెంట్స్ చేసింది. షో చూస్తున్న వారికి ముద్ద మందారం సీరియల్‌ను మళ్లీ గుర్తుకు తెచ్చింది. ఇక ఇమ్మాన్యుయేల్ కూడా తనూజ మాటలకు .. తాను జబర్దస్ ఆర్టిస్ట్ అన్న సంగతి మరిచి.. తను కూడా సీరియల్ ఆర్టిస్టులా.. నువ్వే బెస్ట్ ఫ్రెండ్ నిన్ను మోసం చేయలేదు.. నువ్వు ఏమన్నా అంటే తట్టుకోలేను అంటూ ఏడ్చేశాడు. కట్ చేస్తే ఒక్కసారిగా బరువెక్కిన గుండెతో.. తన కన్నీళ్లను వెనక్కి తీసుకున్న తనూజ.. తన నామినేషన్స్ లో ఫస్ట్ పర్సన్ పవన్ అంటూ చెప్పింది. ఒక్కసారిగా షాకైన పవన్.. ఇప్పటిదాకా ఇమ్మాన్యుయేల్ పేరు చెప్పి జోక్ చేశావా అంటూ ప్రశ్నించాడు. అంతే ఒక్కసారిగా కీచురు గొంతేసుకుని.. మనోడి పై కూడా విరుచుకుపడింది. నా నామినేషన్ నువ్వే.. రీతూ గురించే ఆలోచిస్తావ్ అడతావ్.. గ్రూప్ గేమ్‌లో నువ్వు ఉండవే అంటూ.. పాత వాదననే చాలా గడుసుగా పవన్‌కు చెప్పింది. మెతకోడైన మనోడు.. సగం సగం మాట్లాడి.. సైలెంట్ అయిపోయాడు. అయినా ఇంకేదో మిస్ అయిందని అనుకుందో ఏమో తెలీదు కానీ.. ఆ తర్వాత పవన్ తన నామినేష్స్‌లో భాగంగా.. తనూజ పేరు చెప్పగానే.. వాదించి.. వాదించి.. ఒక్కసారిగా షుగర్ బాటిల్‌ను తన నెత్తిపై తనే కొట్టుకుంది. అలా మరోసారి తనే ఈ హౌస్‌లో కంటెంట్ క్వీన్ అనే విషయాన్ని గుర్తు చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షాజహాన్ – ముంతాజ్ మెచ్చిన రింగ్‌తో నిశ్చితార్థం !! సమంత ఆలోచన వెరీ స్పెషల్
కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ !! గురువేమో నామినేషన్స్‌లో..శిష్యుడు డేంజర్ జోన్ లో
గడ్డివాములో నల్లత్రాచు హల్‌చల్.. భయంతో జనం పరుగులు
